యశ్వంత్ సిన్హా పర్యటనతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు..

యశ్వంత్ సిన్హా పర్యటనతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు..

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది.ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి మధ్య విభేధాలు తీవ్ర స్థాయికి చేరాయి.

 Yashwant Sinha's Visit To The Congress Party, Yashwant Sinha, Congress Party, Re-TeluguStop.com

కాంగ్రెస్ లో కుమ్ములాటలు సహజమేఅయినా, వీరిద్దరి మద్యా చెలరేగిన విభేధాలకు కారణం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు మనస్థాపం కలిగించాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన సీనియర్ నేత జగ్గారెడ్డి ఆయనపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనను పురష్కరించుకుని జగ్గరెడ్డి స్వాగతం పలకడానికి వెళ్లడాన్ని రేవంత్ తీవ్రంగా పరిగణించారు.దాంతో యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన మాటెత్తితే గోడకేసి కొడతాననడం, ఆ వ్యాఖ్యలనే జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు.

యశ్వంత్ పర్యటనను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.సీఎం కేసీఆర్ తానే స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు.మరో వైపు యశ్వంత్ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.తాజాగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యశ్వంత్ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండాలని టీపీసీసీ నిర్ణయించుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రేంవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ గాడిలో పడుతుందని ఆపార్టీనేతల్లో ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి.ఈ నేపధ్యంలో రేవంత్ కు వ్యతిరేకంగా అంతర్గత గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయా అనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.

దీనిపై రేవంత్ తీవ్ర ఆగ్రహాన్నే వ్యక్తం చేసారుఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.హైదరాబాద్ లో తాము యశ్వంత్ ను కలవబోమని ప్రకటించడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కసారిగా నిప్పులు చెరిగారు.

ఈ దిశగా రేవంత్ రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ యస్వంత్ కు స్వాగతం పలకడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లారు ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి

రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనను స్వాగతించిన టీఆర్ ఎస్ శ్రేణులు సీఎం తో సహా ఎయిర్ పోర్టుకు వెళ్లడంతో.అక్కడికి వెళ్లడానికి రేవంత్ వ్యతిరేకించినట్లు పార్టీవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఆయన ఆదేశాలను పాటించకుండా జగ్గారెడ్డి ఎయిర్ పోర్టుకు వెళ్లడంతో పార్టీలో అంతర్గతవిభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

యశ్వంత్ ను కలిసేందుకు ఆయన అపాయింట్ మెంట్ కూడా కోరారు.సిన్హాకు కాంగ్రెస్ మద్దతిస్తున్నప్పుడు ఆయనను సీఎల్పీకి పిలిస్తే గౌరవంగా ఉండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

మరోవైపు సిన్హాను కలవొద్దని ప్రకటించిన రేవంత్, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను తప్పుపడుతూ జగ్గారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

Clpbhatti, Congress, Jagga, Revanth Reddy, Yashwant Sinha-Political

జగ్గారెడ్డి చర్యలపై పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కి ఆగ్రహాన్ని పుట్టించింది.వీహెచ్ ప్రవర్తన ఎంతమాత్రమూ సరికాందంటూ రేవంత్ బహిరంగంగా ఖండించడంతో వివాదం మరింత రచ్చకెక్కింది.సిన్హాతో భేటీ ప్రస్తావన వస్తే గోడకేసి కొడతానంటూ రేవంత్ వ్యాఖ్యానించడంపై సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

హైకమాండ్ మద్దతు ఇస్తే కాదనడానికి రేవంత్ ఎవరంటూ జగ్గారెడ్డి నిలదీసారు.రేవంత్ తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు.అహంకారంతో మాట్లాడుతున్నరేవంత్ ను వెంటనే పీసీసీ ఛీఫ్ పదవినుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఇదే డిమాండ్ తో హైకమాండ్ కు జగ్గారెడ్డి లేఖరాస్తానన్నరు.

ఈ ఇద్దరి నేతల వివాదం చివరకు ఈ వివాదం చివరకు ఎటువైపుకు దారి తీస్తుందో అర్ధంకాక కాంగ్రెస్ వర్గాలు తలపట్టుకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube