ఒకే కాన్పులో నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన ఇల్లాలు!

ఒకే కాన్పులో నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన ఇల్లాలు!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా! కానీ ఇది నిజమే.కర్ణాటకలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

 Woman Gave Birth To Four Children In Karnataka Shivamogga Details, One Delivery,-TeluguStop.com

వివారాల్లోకి వెళితే, భద్రావతి తాలుకాలోని తడసా గ్రామానికి చెందిన 22 ఏళ్ల అల్మాజ్ భాను అనే మహిళ శివమొగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న సోమవారం అనగా మే 23న ప్రసవించింది.దాంతో ఒకే కాన్పులో ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు జన్మించారు.

కాగా ఆ నలుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు అక్కడి హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.ఈ విషయమై భాను కుటుంబం చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రి వైద్యురాలు డా.చేతన మాట్లాడుతూ… “ఒకే కాన్పులో ఇలా నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదు.బేసిగ్గా 5.12 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా నలుగురు పిల్లలు పుట్టే అవకాశం వుంది.ఇటీవల 5 మంది పిల్లలు పుట్టిన ఉదంతాలు కూడా మనం చూసాం.జన్యుపరమైన కారణాల వల్లే నలుగురు పిల్లలు పుట్టారు.” అని పేర్కొన్నారు.ఇకపోతే ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడం ఇదేమీ తొలిసారి కాదు.

నలుగురి కన్నా ఎక్కువమందికి జన్మనిచ్చిన ఘటనలు గతంలో మనం చూసాం.

Almaj Bhanu, Chetana, Karimnagar, Karnataka, Mother, Delivery, Rare, Shivamogga,

ఉదాహరణకు చూసుకుంటే, గతేడాది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిఖిత అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనివ్వడం అందరికీ తెలిసిందే.వైద్యులు సిజేరియన్ ద్వారా ఆమెకు ప్రసవం జరిపారు.పుట్టిన నలుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు.

ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకే సంగారెడ్డి జిల్లాలో బాలమణి అనే మహిళకు కూడా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడం కొసమెరుపు.అయితే ఇక్కడ ఒక బాబు చనిపోగా… మిగతా ముగ్గురు పిల్లలు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube