ఏ సినీ ఇండస్ట్రీ లో అయినా మాస్ ప్రేక్షకులకు దగ్గర అవ్వగలిగితేనే స్టార్ ఇమేజ్ సొంతం అవుతుంది.ఎవరి ఒకరిద్దరు మినహా మిగతా వారంతా మాస్ ప్రేక్షకులకు దగ్గర అయ్యి స్టార్ స్టేటస్ అందుకున్నారు.
ప్రెసెంట్ టాలీవుడ్ లో టాప్ లో ఉన్న హీరోలంతా మాస్ జనానికి దగ్గర అయినవారే.అందుకే ఏ హీరోలు అయినా ఎన్ని లవ్ స్టోరీలు చేసిన ఒక్క మాస్ మసాలా సినిమాతో అయినా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.
.ఒక్క మాస్ సినిమా హిట్ అయితే చాలు ఆ హీరోకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు.
మరి అలాంటి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోల్లో ఎన్టీఆర్ కూడా ముందు వరుసలో ఉన్నారు.అయితే ఈయన మాస్ సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది.
లాస్ట్ సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో మాస్ ప్రేక్షకులకు దగ్గర అవ్వలేదు.
తారక్ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ తిరుగులేని మాస్ హీరోగా అవతరించాలని కోరుకుంటున్నారు.
ఆ కోరికను ఎన్టీఆర్ తన నెక్స్ట్ రెండు సినిమాలతో తీర్చేలాగే కనిపిస్తున్నాడు.ఇటీవలే ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో హిట్ కొట్టి అదే జోష్ ఇప్పుడు రెండు సినిమాలను ప్రకటించాడు.
ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.
జూన్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ మధ్యనే తారక్ పుట్టిన రోజు సందర్భంగా కొరటాల వదిలిన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది.ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 31వ సినిమా చేయనున్నాడు.
ఈ రెండు సినిమాలు కూడా మాస్ హీరోగా తారక్ ను నిలబెట్టే విధంగానే కనిపిస్తున్నాయి.మరి చూడాలి తారక్ అభిమానుల కోరిక ఈ రెండు సినిమాలతో తీరుస్తాడో లేదో చూడాలి.
తాజా వార్తలు