బీజేపీ తో పొత్తు : పవన్ సీరియస్ గా ఆలోచించాల్సిందేనా ?

బీజేపీ తో పొత్తు : పవన్ సీరియస్ గా ఆలోచించాల్సిందేనా ?

ఏపీలో బీజేపీ తో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది.అది ఎన్నికల వరకు కొనసాగుతుందని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు.

 Will Janasena Gets Profited By Continuing Alliance With Bjp Details,  Pavan Kaly-TeluguStop.com

కానీ జనసేన , టిడిపిని కలుపు వెళితేనే ఏపీలో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో బీజేపీ అగ్రనేతల వద్ద ప్రస్తావించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధపడడం లేదు.

అయినా బీజేపీతో ఇప్పటికిప్పుడు పొత్తు పెట్టుకుంటే తలెత్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో పవన్ కు తెలియంది కాదు.అందుకే సైలెంట్ గా ఉంటూ జనసేన ను బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టారు.

2024 ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసే పోటీ చేస్తాయి అన్నట్లుగా పవన్ సంకేతాలు ఇస్తున్నారు.టిడిపితో పొత్తు విషయమై అంతర్గతంగా నిర్వహించిన చర్చల్లో ను ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు టిడిపి సిద్ధంగా లేకపోవడం,  తనను తప్ప మరొకరిని సీఎం అభ్యర్థిగా అంగీకరించేది లేదని,  పవన్ ను సీఎం చేసేందుకు ఒప్పుకున్న పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలని కిందిస్థాయి జనసేన క్యాడర్ నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో,  పవన్ సైతం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని డిసైడ్ అయిపోయారు.

అయితే ఏపీలో బీజేపీ బలం ఎంత అన్నది తేలిపోయింది.నిన్న వెలువడిన ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం తో ఆ పార్టీ బలం పై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.

2019 ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.

Ap Cm, Ap Tdp, Atmakuru, Chandrababu, Janasenabjp, Pavan Kalyan, Somu Veerraju,

ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడంతో, బిజెపి బలం అంతంత మాత్రంగానే ఏపీలో ఉందనే విషయం స్పష్టమవుతోంది.ఈ నేపథ్యంలో బలహీనంగా ఉన్న బిజెపితో పొత్తు కొనసాగించడం వల్ల వచ్చే ప్రయోజనం లేదని, బిజెపి , జనసేన పార్టీలు పొత్తు వల్ల బిజెపినే ఎక్కువ లాభపడుతుంది అనే విషయం స్పష్టం కావడంతో బిజెపితో పొత్తు తెగతెంపులు చేసుకునేందుకు ఇదే సరైన సమయంగా పవన్ కు అనేక విజ్ఞప్తులు అందుతున్నాయి.బలహీనంగా ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన కు అదనంగా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదనే సూచనలు పెద్ద ఎత్తున వస్తున్నాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube