ఎన్టీఆర్ ఇచ్చిన సలహాను ఆ స్టార్ డైరక్టర్ పాటిస్తాడా..?

ఎన్టీఆర్ ఇచ్చిన సలహాను ఆ స్టార్ డైరక్టర్ పాటిస్తాడా..?

ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఆ తర్వాత మరొక సినిమా చేయలేదు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించి వంద కోట్ల క్లబ్ లో చేరిన ఒక డెబ్యూ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

 Will Buchibabu Follow The Ntr Advice , Jr Ntr , Koratala Siva , Ntr30 , Young Tiger Ntr , Prashanth Neel , Buchi Babu Sana ,title Of Peddi-TeluguStop.com

దీంతో ఈయనపై అందరి హీరోల చూపు పడింది.నిర్మాతలు కూడా ఈయనతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కూడా ఈయన మాత్రం మరొక సినిమాను కూడా ప్రకటించలేదు.కానీ బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు.

 ఎన్టీఆర్ ఇచ్చిన సలహాను ఆ స్టార్ డైరక్టర్ పాటిస్తాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన మాత్రం వరుస సినిమాలు చేస్తూ మరొక రెండు సంవత్సరాలు తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.

కానీ ఇటీవలే ఎన్టీఆర్ బర్త్ డే జరుపుకున్న క్రమంలో ‘NTR30’ నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు.ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ లైనప్ లో మరొక డైరెక్టర్ ఉన్నాడు.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.ఇప్పటికే వీరి సినిమా అఫిషియల్ గా ప్రకటించారు.అయితే బుచ్చిబాబుతో కూడా ఎన్టీఆర్ సినిమా అఫిషియల్ గా ప్రకటించక పోయిన ఈ సినిమా కన్ఫర్మ్ గా ఉందట.స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని.

ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బుచ్చిబాబు కథ విన్న తర్వాత ఎన్టీఆర్ కథలో కొన్ని మార్పులు చెప్పారట.కథ బాగుందని కానీ అందుకే లవ్ ట్రాక్ ను మరింత ఆసక్తికరంగా ఉండేలా మార్పులు చేయమని ఎన్టీఆర్ ను కోరారట.మరి ఉప్పెన వంటి క్రేజీ లవ్ స్టోరీని తెరకెక్కించిన బుచ్చిబాబు ఎన్టీఆర్ తో చేసే సినిమాలో లవ్ ట్రాక్ ను ఏ విధమైన మార్పులు చేస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube