ఐటెం సాంగ్స్ అంటే పిచ్చెక్కిపోతున్న దర్శకులు.. వాటిపైనే స్పెషల్ ఇంట్రెస్ట్? 

ఐటెం సాంగ్స్ అంటే పిచ్చెక్కిపోతున్న దర్శకులు.. వాటిపైనే స్పెషల్ ఇంట్రెస్ట్? 

సాధారణంగా సినిమాల్లో ఎన్ని పాటలు ఉన్న ఒక స్పెషల్ ఉంది అంటే అది ఎంతో ప్లస్ పాయింట్ గా మారుతూ ఉంటుంది.స్పెషల్ సాంగ్ లో ఒక హాట్ హీరోయిన్ కనిపించింది అంటే చాలు ఆ సాంగ్ చూడటానికి అయినా సినిమాకు వస్తూ ఉంటారు ప్రేక్షకులు.

 Why Tollywood Directors Are Intrested In Item Songs Details, Item Songs, Tollywo-TeluguStop.com

ఇటీవలి కాలంలో స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా స్పెషల్ సాంగ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది అర్థమవుతుంది.ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఎంతోమంది దర్శకులు ఉన్నా ఎందుకో సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ అంటే ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది.

ఇప్పటి నుంచే కాదు కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఐటం సాంగ్స్ పై ప్రత్యేకమైన దృష్టి పెడుతూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చాడు సుకుమార్.ఇటీవలే పుష్ప సినిమాలో సమంత ఐటం సాంగ్ చేసి ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

రాజమౌళి కూడా తన సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తూ ఉంటాడు.త్రిబుల్ ఆర్, ఈగలో తప్ప అన్ని సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్ పెట్టేసాడు అని చెప్పాలి.

ఇప్పుడు మహేష్ తో తీయబోయే సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండే అవకాశం ఉంది.పూరి జగన్నాథ్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

అందరి అంటే డిఫరెంట్ గా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పూరి జగన్నాథ్.హీరో ఎవరైనా సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే.

Salaar, Anil Ravipudi, Boyapati Srinu, Sukumar, Item, Pooja Hegde, Puri Jagannat

ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి సైతం కాస్త ఎక్కువగానే ఐటెం సాంగ్స్ పై కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపుతారు.ఇక మరో డైరెక్టర్ కొరటాల శివ సైతం తన సినిమాల్లో స్పెషల్ సాంగ్ కి ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు.ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి సైతం పూజా హెగ్డే తో స్పెషల్ సాంగ్ చేయించి అందరి దృష్టిని ఆకర్షించాడు.టాలీవుడ్ దర్శకులు అందరూ కూడా ఐటెం మేనియాలో మునిగిపోతున్నారనే చెప్పాలి.

Salaar, Anil Ravipudi, Boyapati Srinu, Sukumar, Item, Pooja Hegde, Puri Jagannat

ఐటెం సాంగ్ సక్సెస్ ట్రాక్ అంటూ నమ్ముతున్నారు.ఈ క్రమంలోనే పుష్ప 2, బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఎవరు స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని హాట్ టాపిక్ గా మారిపోయింది.ఇక ప్రభాస్ తో సలార్ తీస్తున్న ప్రశాంత్ నీల్ సైతం ఒక హాట్ బ్యూటీ తో స్పెషల్ సాంగ్ చూపించబోతున్నాడు అని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube