స్త్రీలు గాజు గాజుల్ని ఎందుకు వేసుకోవాలి?

why indian women wear bangles

స్త్రీలు గాజులు వేసుకోవటం వెనక అందమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన హిందూ ధర్మ శాస్త్రం చెప్పుతుంది.గాజులు వేసుకోవటం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి.

 Why Indian Women Wear Bangles-TeluguStop.com

అప్పుడే పుట్టిన పిల్లలకు నల్లని గాజులు వేయటం మనం చూస్తూనే ఉంటాం.ఆలా నల్లని గాజులు వేయటం వలన దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి.

అంతేకాకుండా ఆ గాజుల శబ్ధం పిల్లలకు సంతోషాన్ని కలిగిస్తుంది.

మన పెద్దవారు ఆడపిల్ల లక్ష్మి స్వరూపమని…ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతుంటే ఇంటిలో లక్ష్మి దేవి తిరుగుతుందని భావిస్తారు.

అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవటం అలవాటు చేస్తారు.ఆడపిల్లలు గాజులు చిట్లకుండా చూసుకుంటే జీవితంలో వచ్చే సమస్యలను, ఇంటి వ్యవహారాలను చక్కగా పరిష్కారం చేస్తారని పెద్దల నమ్మకం.
ఇప్పుడు ఏ రంగు గాజులను వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలిరంగు గాజులు విఙ్ఞానాన్ని, ఊదారంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని, పసుపు రంగు గాజులు సంతోషాన్ని, నారింజ రంగు గాజులు విజయాన్ని, తెలుపు రంగు గాజులు ప్రశాంతతను, నలుపు రంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం గాజులు స్త్రీల సౌభాగ్యానికి చిహ్నం.బంగారు గాజులు ఎన్ని వేసుకున్న కనీసం రెండు మట్టిగాజులైనా తప్పనిసరిగా ధరించాలి.అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులతో పూజిస్తారు.కాబట్టి.

మట్టిగాజులు వేసుకోవడం.ఐదవతనాన్ని సూచిస్తుంది.

మన భారతీయులు గాజులు పగలడాన్ని అమంగళం, అశుభంగా భావిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube