మనసంతా నువ్వే సినిమాను మహేష్ బాబు చేయకుండా కుట్ర చేసింది ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం జరుగుతూ ఉంటుంది.ఇక ఇలాంటి సినిమాలు కొన్ని కొన్ని సార్లు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి.

 Who Stopped Mahesh Babu From Manasantha Nuvve Movie Details, Mahesh Babu, Manasantha Nuvve Movie, Director Aditya, Producer Ms Raju, Heor Uday Kiran, Chitram, Nuvvu Nenu, Love Story, Tollywood, , Anmol Gadi Movie-TeluguStop.com

ముందుగా దర్శకుడు ఒక హీరో గురించి కథల రాసుకున్నప్పటికీ ఆ హీరో వివిధ కారణాలతో సినిమాకి నో చెప్పడం కారణంగా ఈ కథతో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇంకో హీరోతో సినిమా తీయడం లాంటివి చేస్తూ ఉంటారు.ఇక ఇలా సినిమా తీసిన తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా అన్నది మాత్రం అటు ప్రేక్షకులు చేతిలోనే ఉంటుంది అని చెప్పాలి.

ఇలా ఒక హీరో చేయాల్సింది మరో హీరో తీసిన సినిమాలు చాలానే ఉన్నాయి అలాంటి సినిమాల్లో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి.ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన మనసంతా నువ్వే సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 మనసంతా నువ్వే సినిమాను మహేష్ బాబు చేయకుండా కుట్ర చేసింది ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిత్రం నువ్వు-నేను లాంటి సూపర్ హిట్ సినిమాలతో యువతుల్లో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. ఇక అప్పుడు ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే చేస్తే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

అయితే ఓ కెమెరామెన్ ఆదిత్య దగ్గర ఉన్న కథ గురించి నిర్మాత ఎమ్మెస్ రాజు చెప్పాడట.దీంతో వెంటనే దర్శకుడు ఆదిత్య కు ఫోన్ చేసి కలవాలంటూ అడిగాడట నిర్మాత ఎమ్మెస్ రాజు. కానీ దర్శకుడు ఆదిత్య మాత్రం ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునే వాడట.తాను ఒక లవ్ స్టోరీ తో ఇండస్ట్రీకి పరిచయం కావాలని అనుకుంటున్నాను అంటూ ఓ సమయంలో నిర్మాత ఎమ్మెస్ రాజు చెప్పారట ఆదిత్య.

ఈ క్రమంలోనే బాలీవుడ్లో వచ్చిన అన్మోల్ గాడి సినిమాకు తెలుగు కథను సిద్ధం చేశాడు మనసంతా నువ్వే టైటిల్ ఫిక్స్ చేశారు ఇక అప్పటికి ఈ సినిమా కోసం మహేష్ బాబు డేట్ లో కూడా ఇచ్చారట కానీ దర్శకుడు ఆదిత్య మాత్రం కొత్త కుర్రాడు అయితే బాగుంటుందని అనుకున్నాడట ఇలాంటి సమయంలోనే చిత్రం సినిమా చూసిన దర్శకుడు ఆదిత్య ఇతనే హీరో అయితే బాగుంటుంది అని అనుకోవడం తో మహేష్ బాబు ని కాదని ఉదయ్ కిరణ్ తో సినిమా చేసారట

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube