మీ పెదాల రంగు మీ గురించి ఏమి చెప్పుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు  

What Your Lip Colour Says About You -

ముఖానికి పెదవులు అందాన్నిఇస్తాయి.పెదాలు అందంగా ఉంటే అందరి దృష్టిని ఆకర్షిస్తారు.

అందమైన పెదాలకు చక్కని చిరునవ్వు తోడైతే ఎవరైనా ఫిదా అవుతారు.ఈ రోజుల్లో చాలా మంది పెదాలకు లిప్ స్టిక్ వేసుకుంటున్నారు.

What Your Lip Colour Says About You-General-English-Telugu Tollywood Photo Image

వారు లిప్ స్టిక్ ఎంచుకొనే విధానాన్ని బట్టి వాటి ఆలోచన ఎలా ఉంటుందో చెప్పవచ్చు.కొంత మంది ఎరుపు రంగును ఇష్టపడితే మరి కొంత మంది గులాబీ రంగును ఇష్టపడవచ్చు.

ఆలా వారు రంగును ఎంచుకొనే విధానాన్ని బట్టి వారి వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు.

ఎరుపు
ఎరుపు రంగు లిప్ స్టిక్ వేసుకొనే మహిళలు చాలా దైర్యంగా, శక్తివంతంగా ఉండటమే కాకుండా లిబరల్ గా ఉంటారు.

అలాగే వీరిలో కాస్త రొమాన్స్ కూడా ఎక్కువే.

గులాబీ రంగు
గులాబీ రంగు లిప్ స్టిక్ వేసుకొనే అమ్మాయిలు చాలా దయ హృదయాన్ని కలిగి ఉంటారు.

అలాగే అందరితో కలివిడిగా ఉంటూ స్నేహంగా ఉంటారు.

బ్రౌన్ రంగు
ఎరుపు రంగు కాస్త ముదిరినట్టు ఉండే బ్రైన్ లిప్ స్టిక్ ని వేసుకునే అమ్మాయిలు చాలా ఎక్కువమందే ఉంటారు.ఈ రంగు లిప్ స్టిక్ వేసుకునే వారు చాలా డిఫరెంట్ గా ఉండి ఎవరికీ అర్ధం కారు.

పారదర్శకంగా ఉండే రంగు
పారదర్శకంగా ఉండే లిప్ స్టిక్ వేసుకొనే అమ్మాయిలు చాలా సింపుల్ ఉండటానికి ఇష్టపడతారు.

వీరు చాలా నిదానంగా,కూల్ గా ఉంటూ ఎటువంటి అత్యాశలకు పోరు.

నలుపు
నలుపు రంగు లిప్ స్టిక్ వేసుకొనే వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యం కలుగుతుందా? పేజ్ 3 పార్టీల్లో గమనిస్తే నలుపు షేడ్ వేసుకున్నవాళ్లు చాలా మంది కనపడతారు.అలాంటి వాళ్లు చాలా మొండిగా ఉంటారు.వారితో మాట్లాడడం చాలా కష్టమైన పని.ఎడ్డెం అంటే తెడ్డెం అంటూ వాదన పెట్టుకుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube