నెలసరి సమయంలో ఎలాంటి ధర్మాలు పాటించాలి? వాటి వల్ల ఉపయోగం ఏంటి?

నెలసరి సమయంలో ఎలాంటి ధర్మాలు పాటించాలి? వాటి వల్ల ఉపయోగం ఏంటి?

ఆడపిల్లలు రజస్వల అయినప్పుడు అంటే రుతుక్రమం ప్రారంభమైన సమయంలో దానిని పెద్ద మనిషి అని అంటూ ఉంటారు ఈ సమయంలో కొన్ని కట్టుబాట్లు పాటించాలని పెద్దలు ఎప్పుడూ చెప్పే మాట.శారీరకంగా చోటు చేసుకునే కొన్ని మార్పుల వల్ల ఆ సమయంలో కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు.

 What Are The Virtues To Be Observed During The Monthly Period What Is The Use O-TeluguStop.com

ఇలా జాగ్రత్తలు పాటించడం వల్ల అటు ఆరోగ్యానికి, ఇటు శాస్త్రీయంగా కూడా మేలు జరుగుతుందని సూచిస్తూ ఉంటారు.ఆరోగ్య పరమైన నియమాలు పాటించి తీరాలని వైద్యులు నొక్కి చెబుతారు.

మంచి సంతానం కలగడం కోసం ఈ నియమాలను పాటించాలంటారు.

యజుర్వేదం ప్రకారం అయితే రజస్వల అయిన సమయంలో కొన్ని నియమాలు పాటించాలి.

అవి ఏంటంటే. బయట ఉన్న స్త్రీతో కలిస్తే పుట్టబోయే పిల్లలు దొంగలు అవుతారు.

ఆ స్త్రీలో మాటలు కలిపితే సిగ్గు పడే మనస్తత్వం వస్తుంది.తలంటుకుంటే కుష్ఠ మొదలగు రోగాలతో పుడతాడు.

నేలమీద రాసినచో బట్టతల ఉండే పిల్లలు కలుగుతారు.బయట ఉన్న స్త్రీలు కాటుక పెట్టుకుంటే గుడ్డి వాళ్లు పుడతారు.

పండ్లు తోము కుంటే పుప్పి దంతాలు కలిగినవాడు, కుట్టితే నసంపుకుడు, ఆకులతో నీళ్ళు తాగితే పిచ్చి వాడు, తాళ్ళు పేనితే ఉరి పోసుకుని చనిపోయే వాడు కలుగుతారు.చిన్న చెంబుతో నీటిని తాగితే మరుగుజ్జువాడు, ఇట్లా చెడ్డ సంతానం కలుగుతుందని యజుర్వేదంలో ఉంది.

 చేతులతోగాని, నిప్పులో వేయని మూకుడులోగాని నీళ్లు తాగాలి.ఇత్తడి పాత్రలో నీటిని తాగవచ్చు.

బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ఉతక్కోకూడదు.నాల్గవ రోజున వడ్లు దంచాలని బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతోంది.

పగలు నిద్రపోకూడదు.మాంసం తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube