జుట్టుకు ఈ రెండింటిని ఉపయోగిస్తే జుట్టు పెరుగుదలను ఎవరు ఆపలేరు  

Vitamin E Capsules For Hair Growth -

వాసెలిన్ ను సాధారణంగా చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచటానికి ఉపయోగిస్తాం.పగిలిన చర్మాన్ని,పాదాలను,పెదాలను మరమత్తు చేసి మృదువుగా మారేలా చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది.

అంతేకాకుండా చర్మంలోని మలినాలను,తాన్ తొలగించుకోవడానికి కూడా బాగా పనిచేస్తుంది.కొంచెం వాసెలిన్ ను తీసుకోని ముఖానికి రాసి 5 నిముషాలు మసాజ్ చేసి తేలికపాటి సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Vitamin E Capsules For Hair Growth-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఇలా చేయటం వలన ముఖం మీద పేరుకుపోయిన మలినాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.అయితే వాసెలిన్ చర్మ ప్రయోజనాలకే కాకూండా జుట్టు రాలకుండా తొందరగా పొడవు పెరగటానికి సహాయపడుతుంది.

ఇప్పుడు ఆ చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం.


ఈ చిట్కా తల మీద చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి జుట్టు రాలకుండా బాగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.ఈ చిట్కాకు వాసెలిన్, విటమిన్ E క్యాప్సిల్,కొబ్బరి నూనె అవసరం అవుతాయి.ఒక బౌల్ లోకి ఒక స్పూన్ వాసెలిన్, ఒక స్పూన్ కొబ్బరి నూనెను,రెండు విటమిన్ E క్యాప్సిల్స్ లోని ఆయిల్ ని వేసి బాగా కలిపి తల మీద చర్మం మీద వృత్తాకార మోషన్ లో 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

మసాజ్ చేసాక రాత్రంతా ఆలా వదిలేసి మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలటం,జుట్టు చిట్లటం వంటి సమస్యలు తగ్గిపోతాయి.

అంతేకాక జుట్టు వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి ఒక్కసారి మీరు అప్లయ్ చేసి చూడండి.మీకు తేడా రెండు వారాల్లోనే తెలుస్తుంది.జుట్టు పెరుగుదలను చూసి చాలా ఆశ్చర్యపోతారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube