వైరల్: సిగరెట్‌ తాగుతూ రిలాక్స్ అయిన ఒరెంగుటాన్‌.. మండిపడుతున్న జంతు ప్రేమికులు?

వైరల్: సిగరెట్‌ తాగుతూ రిలాక్స్ అయిన ఒరెంగుటాన్‌.. మండిపడుతున్న జంతు ప్రేమికులు?

ఒరెంగుటాన్ పేరు వినే వుంటారు.ఇవి చూడడానికి అచ్చం చింపాజీలను పోలి ఉంటాయి.

 Viral Video Orangutan Getting Relax While Smoking In The Zoo Details, Chimpanzee-TeluguStop.com

అందువలన చాలామంది వీటిని చింపాజీలనే అనుకుంటారు.ఇవి బేసిగ్గా మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఉంటాయి.

జూలో వున్నపుడు ఇవి సందర్శకులు ఇచ్చిన ఆహార పదార్థాలు తినడంతో పాటు వారితో బాగా అడ్డుకుంటాయి కూడా.ఇక ఇవ్వి మనుషుల్లానే బాధ కలిగినప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తాయి.

అందుకే వీటికి సంబంధించిన వీడియోలు ఇటీవల నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే సదరు విడియోపైన జంతు ప్రేమికులు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఎందుకంటే వీడియోలో ఒరెంగుటాన్‌ ఓ చైన్ స్మూకర్ లాగా మారిపోయింది.మనిషిలాగా తాపీగా కూర్చోని సిగరెట్‌ తాగడం చూపరులను ఔరా అనిపిస్తోంది.ఇక ఇదే విషయం యానిమల్‌ లవర్స్‌, నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

అసలే అంతరించిపోయే దశలో ఉన్న ఒరెంగుటాన్లకు ఈ గతి పట్టిందేమిటి? అని వాపోతున్నారు.ఈ విషయమై జూ నిర్వాహకులను వారు ప్రశ్నిస్తున్నారు?

వివరాల్లోకి వెళితే, వియ‌త్నాంలోని హోచిమిన్ సిటీలోగ‌ల సైగాన్ జూ, బొటానిక‌ల్ గార్డెన్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలంగా మారింది.ఈ వీడియోలో ఒరెంగుటాన్ నేల‌పై కూర్చొని తాపీగా సిగ‌రెట్‌ను అచ్చం మ‌నిషిలాగే తాగుతూ రిలాక్స్ అవుతుంది.ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో బాగా చక్కర్లు కొడుతోంది.

అయితే జూ నిర్వాహకులు ఈ విషయంలో తమ తప్పులేదని చెబుతున్నా జంతు ప్రేమికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.‘అసలే ఒరెంగుటాన్లు అంతరించిపోయే జీవజాతుల జాబితాలో ఉన్నాయి.

అలాంటి స్థితిలో వాటికి సిగరెట్లు ఎలా అందిస్తారు.ఓ జీవిని హానికరమైన పదార్థాలకు బానిసలుగా మారుస్తారా’ అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube