వియత్నాంకు విమాన టికెట్ ధర కేవలం 18 డాలర్లే.. ఎందుకంటే

వియత్నాంకు విమాన టికెట్ ధర కేవలం 18 డాలర్లే.. ఎందుకంటే

ప్రస్తుతం ఎయిర్‌ప్లేన్ ఇంధనం (ATF) ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి.దీంతో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి.ఇలాంటి పరిస్థితుల్లో పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే విమానానికి వన్‌ వే టికెట్ ఖరీదే రూ.5 వేల పైగానే పలుకుతోంది.దేశంలో ఏ నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలన్నా ధర రూ.5 వేలు తగ్గదు.ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ రూపాయలలో సుమారు రూ.1,400లకే విదేశాలకు వన్-వే ఫ్లైట్ టిక్కెట్‌ను పొందవచ్చు.ఈ ఆఫర్ వియత్నాం ఏవియేషన్ కంపెనీ వియట్జెట్ నుండి ఇది లభిస్తోంది.ఇది భారతదేశం నుండి వియత్నాంకు నాలుగు కొత్త విమాన మార్గాలను ప్రారంభించింది.

 Vietjet Airways Offering Flight Ticket For Just 18 Dollars From India To Vietnam-TeluguStop.com

భారతదేశం-వియత్నాం మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.ఈ సందర్భంగా వియట్‌జెట్ నేరుగా వెళ్లే నాలుగు సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది.

ఈ సర్వీస్ భారతదేశంలోని ముంబై నగరం, వియత్నామీస్ నగరమైన హో చి మిన్ సిటీ లేదా హనోయికి న్యూ ఢిల్లీ, ముంబై నుంచి సర్వీసులు ఉంటాయి.న్యూ ఢిల్లీని హో చి మిన్ సిటీ, హనోయితో కలుపుతూ రెండు దేశాల మొదటి ప్రత్యక్ష విమాన సేవలు ఏప్రిల్‌లోనే ప్రారంభమయ్యాయి.

ఈ మార్గంలో ప్రతి వారం మూడు నుంచి నాలుగు విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.ప్రయాణికులు ఇప్పుడు ఈ మార్గాల కోసం విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని, వన్-వే ఛార్జీలు 18 యూఎస్ డాలర్లు కంటే తక్కువగా ఉంటాయని కంపెనీ తెలిపింది.

అయితే ఇందులో పన్నులు, రుసుములు ఉండవు.

VietJet ప్రకారం సెప్టెంబర్ 9, 2022 నుండి ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు ముంబై-ఫు క్వాక్ మార్గంలో నాలుగు వారపు విమానాలు ప్రవేశపెట్టబడతాయి.

Dollars, Dollers, Cheap Ticket, Ticket, India Vietnam, Mumbai, Delhi, Vietjet Ai

న్యూఢిల్లీ నుంచి ఫ్యూకోక్ మధ్య సర్వీసులు కూడా సెప్టెంబర్ 9, 2022 నుండి ప్రారంభం అవుతాయి.ఈ విమానాలు ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉంటాయి.హో చి మిన్ సిటీ/హనోయి-ముంబై మార్గాల్లో ఈ నెలలో విమానాలు ప్రారంభమయ్యాయి.వియత్నాం-ఇండియా ఫ్లైట్ నెట్‌వర్క్ విస్తరణ రెండు దేశాల మధ్య ప్రయాణ కనెక్టివిటీ మరియు వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వియత్‌జెట్ వైస్ ప్రెసిడెంట్ న్గుయెన్ థాన్ సన్ చెప్పారు.

అతని కంపెనీ వియత్నాం రాజధాని హనోయి, దాని అతిపెద్ద నగరం హో చి మిన్-భారతదేశ రాజధాని న్యూఢిల్లీ మధ్య నేరుగా విమాన సేవలను ప్రారంభించిన మొదటి సంస్థగా పేరొందింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube