విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన F2 సూపర్ హిట్ కాగా అదే కాంబో రిపీట్ చేస్తూ వస్తున్న సినిమా F3.డైరక్టర్ అనీల్ రావిపుడి ఈసారి ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేసేలా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.
ఇప్పటికే ట్రైలర్ తోF3 సూపర్ హిట్ పక్కా అన్న క్రేజ్ తెచ్చుకుంది.దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయిందని తెలుస్తుంది.
సినిమాపై విపరీతమైన పాజిటివ్ బజ్ ఏర్పడటంతో ఆ ఎఫెక్ట్ బిజినెస్ మీద కనబడింది. F3 సినిమా 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. సినిమా సాధారణ ప్రేక్షకులు, ఫ్యామిలీస్ కూడా చూసేలా టికెట్ రేట్లని పెంచట్లేదని నిర్మాత ప్రకటించారు.అయితే టికెట్లు రేట్లు పెంచకపోయినా సినిమా ఖచ్చితంగా రికార్డ్ వసూళ్లు తెస్తుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు.వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి F3తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.F3 సినిమా అనుకున్న సక్సెస్ అందుకుందా లేదా అన్నది తెలియాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే. చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం పక్కా అని ఫిక్స్ అయ్యారు.