నిజంగా వెంకటేష్, రోజాల మధ్య మాటలు లేవా.. కారణం ఏంటి?

Venkatesh And Roja Didnt Talk Each Other Do You Know The Reason

ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య ప్రేమలు పుట్టడం, గొడవలు జరగడం కామన్.వాళ్ళ మధ్య ఎప్పుడు ప్రేమ పుడుతుందో, ఎప్పుడూ గొడవ జరుగుతుందో కూడా వాళ్లకే తెలీదు.

 Venkatesh And Roja Didnt Talk Each Other Do You Know The Reason-TeluguStop.com

ఇప్పటికే ఎంతో మంది నటీనటులకు, దర్శకులకు, నిర్మాతలకు ఇలా ఎన్నో సార్లు వాళ్ల వాళ్ల మధ్యనే గొడవలు జరిగాయి.మళ్ళీ వెంటనే వాటిని మర్చిపోయి కలుసుకున్న వాళ్లు కూడా ఉన్నారు.

కానీ వెంకటేష్, రోజాల మధ్య జరిగిన గొడవతో వాళ్లు ఇప్పటికీ మాట్లాడుకోవడం లేదు.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

 నిజంగా వెంకటేష్, రోజాల మధ్య మాటలు లేవా.. కారణం ఏంటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి అందరికి తెలిసిందే.ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు.పైగా ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు.ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో యంగ్ హీరోలకు పోటీగా అవకాశాలు అందుకుంటూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు.

ఇప్పటివరకు వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి గొడవలకు వెళ్లినట్లు టాక్ కూడా రాలేదు.పైగా అందరితో ఒకేలా ఉంటాడు వెంకటేష్.అటువంటిది ఈయనకు రోజాకు మధ్య గొడవ జరిగిందట.టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజా గురించి తెలియని వారే లేరు.

ఒక నటిగా, రాజకీయ నాయకురాలిగా, బుల్లితెర జడ్జిగా అందరికీ పరిచయమే.

ఇక ఈమె కూడా ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న బుల్లితెరపై నిత్యం సందడి చేస్తుంది.బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో జడ్జిగా బాధ్యతలు చేపట్టింది.

ఇక ఈమె వెంకటేష్ తో పలు సినిమాలలో కూడా నటించింది.కానీ ఆ తర్వాత అవకాశాలు వచ్చినా కూడా వదులుకుంది.

Chinna Rayudu, Mis, Pokiri Raja, Roja, Roja Venkatesh, Selvamani, Tollywood, Venkatesh-Movie

ఇంతకు వాళ్ల మధ్య అసలేం జరిగిందంటే.ఒకప్పుడు అంటే దాదాపు 25 ఏళ్లకు ముందు వెంకటేష్, రోజా హీరో హీరోయిన్ గా చిన్న రాయుడు అనే సినిమాలో నటించాలని అనుకున్నారు.దీంతో ఈ సినిమాకు దర్శకుడిగా రోజా భర్త సెల్వమణి బాధ్యతలు తీసుకుందామని అనుకున్నాడు.కానీ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో వెంకటేష్ వేరే దర్శక నిర్మాతలతో కలిసి మరో స్టార్ హీరోయిన్ విజయశాంతితో నటించాడు.

Chinna Rayudu, Mis, Pokiri Raja, Roja, Roja Venkatesh, Selvamani, Tollywood, Venkatesh-Movie

ఇక రోజాకు వెంటనే బాధ, కోపం కలగటంతో వెంకటేష్ పై ఫైర్ అయ్యింది.దీంతో వెంకటేష్ ఇందులో తన ప్రమేయం లేదని కేవలం దర్శకనిర్మాతల వల్లనే హీరోయిన్ ను మార్చాల్సి వచ్చిందని తెలిపాడు.దాంతో రోజా కూడా కాస్త రిలీఫ్ అయింది.ఆ తర్వాత మళ్లీ వెంకటేష్ తో కలిసి పోకిరి రాజా అనే సినిమాలో నటించింది.ఇక ఈ సినిమా షూటింగ్ కోసం సినీ బృందం మొత్తం ముంబైకు వెళ్లారట.

Chinna Rayudu, Mis, Pokiri Raja, Roja, Roja Venkatesh, Selvamani, Tollywood, Venkatesh-Movie

అందులో రోజా కూడా ఉంది.దీంతో హోటల్ లో రోజాను మూడు రోజులపాటు ఎటువంటి షూటింగ్ పనులు లేకుండా ఖాళీగా కూర్చో పెట్టారట.దీంతో తనకు విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లి పోయిందని తెలిసింది.

ఆ తర్వాత వెంకటేష్ తో కొన్ని వాదనలు జరగటంతో మరి మధ్య అప్పుడే మాటలు కట్ అని అందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి మధ్య మాటలు లేవని అంటే దాదాపు 25 ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య మాటలు లేవని తెలిసింది.మరి వీరిద్దరూ ఎప్పుడు కలుసుకుంటారో చూడాలి.

#Selvamani #Chinna Rayudu #Venkatesh #Pokiri Raja #Roja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube