వంగ‌వీటి మైన‌స్ లే.. నానికి ప్ల‌స్ పాయింట్స్..!

వంగ‌వీటి మైన‌స్ లే.. నానికి ప్ల‌స్ పాయింట్స్..!

మాస్ లీడ‌ర్ వంగ‌వీటి రంగా వార‌సుడిగా వంగ‌వీటి రాధాకు ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో బోలెడంత జ‌నాక‌ర్ష‌ణ ఉంది.త‌న తండ్రి రాష్ట్ర స్థాయి బలమైన నేతగా ఏపీలో అత్యధిక ఓట్ షేర్ కలిగిన కాపులకు ఆరాధ్య దైవం భావించ‌బ‌డ్డారు.

 Vangaveeti Radha Minus Points Turning Plus To Kodali Nani Details, Ap, Vangaveet-TeluguStop.com

అయితే రంగా వారసుడిగా రాధా స‌క్సెస్ కాలేకపోతున్నార‌ని అంటున్నారు.రాధాలో ఆ తరహా దూకుడు కరువైంద‌ని.

రాంగ్ డెసిష‌న్స్ తో ప‌రిస్థితి ఇలా ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.అదే కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ గ‌ళం పెంచి మాట్లాడే తీరుతో ఆక‌ట్టుకుంటున్నారు.

దీంతో వంగ‌వీటి రాధ మైన‌స్ లేంటి.? అన్న చ‌ర్చ మొద‌లైంది.రాధా నిలకడలేని తత్వం.రెండు దశాబ్దాల ప్రత్యక్ష రాజకీయ జీవితంలో 2004లో ఒకే ఒక సారి గెలిచారు.ఆ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్ల‌లేక‌పోయారు.కార‌ణం పార్టీలు మార‌డ‌మే అని అంటున్నారు.

రంగా వార‌సుడిగా ఇప్ప‌టికే స్టేట్ లెవ‌ల్ బ‌ల‌మైన నేత‌గా ఎద‌గాల్సిన రాధా వ‌చ్చిన అవ‌కాశాల‌ను వినియోగించుకోలేక‌పోయార‌ని.ఆవేశంతో త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్లే ఆయ‌న ఆ స్థాయికి ఎద‌గ‌లేక‌పోయారని అంటున్నారు.

బ‌ల‌మైన గ‌ళం వినిపించే నేతగా ఆయ‌న జిల్లాలో ఫోకస్ కాలేకపోవడం.బ‌ల‌మైన క్యాడర్ అండ‌గా లేక‌పోవ‌డం లోట‌నే చెబుతున్నారు.

అంతేకాకుండా ఆర్థికంగా కూడా వీక్ గా ఉన్నారని అంటున్నారు.రంగా వార‌సుడిగా ప్ర‌జ‌ల్లో తిర‌గాలంటే డ‌బ్బులు కూడా ఎక్కువే ఉండాలి.అయితే రాధా దూకుడు విష‌యంలో ఇది కూడా ఓ కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.2019 ఎన్నిక‌ల ముందు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు ఆశించి ద‌క్క‌క‌పోవ‌డంతో ఆ పార్టీ వీడిన రాధా ప్ర‌స్తుతం టీడీపీలో కొన‌సాగుతున్నారు.అయితే టీడీపీ కంచుకోట విజ‌య‌వాడ‌లో ఫోక‌స్ కావాల్సిన రాధా యాక్టీవ్ గా లేక‌పోవ‌డంతో ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చేలా లేదు.

Chandrababu, Kodali Nani, Lokesh, Vijayavada-Political

ఇప్ప‌టికే నిల‌క‌డ లేని త‌త్వం అంటుంటే ప్ర‌స్తుతం ఆయన జనసేన వైపు చూస్తున్నార‌నే ప్రచారం సాగుతోంది.అలాగే రాధా పొలిటిక‌ల్ కెరీర్ పై వ్యక్తిగత స్నేహాలు కూడా చాలా ప్రభావం చూపిస్తున్నాయ‌ని అంటున్నారు.ఎందుకంటే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నానితో స‌న్నిహితంగా మెల‌గ‌డ‌మే.

ఈ ఇద్దరితో రాధా ప‌దే ప‌దే భేటీ అవుతుండ‌టంతో తిరిగి వైసీపీలోకి వెళ్తారే ప్ర‌చారం కూడా ఉంది.దీని వల్ల కూడా రాధా అనుచరులకే అనుమానాలు క‌లిగే పరిస్థితి ఏర్పడుతోంది అంటున్నారు.

రాధాకృష్ణ‌ తన నిలకడ లేని విధానాల వల్లే త‌న తండ్రిని ఆరాధ్య దైవంగా భావించే కాపుల మ‌ద్ద‌తు కోల్పోయాడ‌ని అంటున్నారు.

Chandrababu, Kodali Nani, Lokesh, Vijayavada-Political

ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నానిని ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా దీటుగా ఎదుర్కుంటారు.గుడివాడలో నాలుగు సార్లు గెలిచి కంచుకోటను చేసుకున్నారు.కాపులతో ఇతర సామాజిక వర్గాలతో సఖ్యత కొనసాగిస్తూ తన విజయానికి ఢోకా లేకుండా చేసుకుంటున్నారు.

త‌ప్పో ఒప్పో గ‌ట్టిగానే స్పందిస్తారు.పైగా బాబును, చిన‌బాబుని తిడుతూ.

ఎన్టీఆర్ భక్తుడిన‌ని అనిపించుకుంటాడు.ఇక మంత్రిగా చేశారు… ఆర్ధికంగా కూడా బాగా ఉన్నారు.

ఇదే నాని ఎద‌గ‌డానికి ప్ల‌స్ అవుతోంది.మ‌రి మాస్ లీడ‌ర్ వార‌సుడిగా స్టేట్ ఫిగ‌ర్ కావాల్సిన రాధా ఇప్ప‌టికైనా త‌న పంథా మార్చుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube