1976లో మొదటిసారి ఎన్టీఆర్, కృష్ణ మధ్య పోటీ.. ఎవరు గెలిచారో తెలుసా?

ఇండస్ట్రీలో నటసార్వభౌముడుగా పేరు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా మారిన కృష్ణ మధ్య ఎప్పుడూ సినిమాల విషయంలో పోటీ ఉండేది అన్న విషయం తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ లూ హీరోలుగా నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.

 Unknown Facts About Krishna And Ntr Nirdoshi Iddaru Monagallu Movies Details, Senior Ntr, Super Star Krishna, Iddaru Monagallu Movie, Nirdoshi Movie, Krishna Vs Sr Ntr, Box Office Fight, Tollywood Kantharao, Ntr Nirdoshi, Krishna Iddaru Monagallu-TeluguStop.com

ఇక ఎవరికి వారు తమదైన రీతిలో సినిమాలు తీస్తూ సూపర్ హిట్లు అందుకున్నారు.అయితే మొదటి సారి వీరిద్దరి మధ్య పోటీ జరిగింది 1976లో అని చెప్పాలి.

1976 మార్చి 22వ తేదీన నందమూరి తారకరామారావు హీరోగా నటించిన నిర్దోషి సినిమా విడుదలైంది.ఇక ఈ సినిమాలో అన్నగారు ద్విపాత్రాభినయం చేశారు అని చెప్పాలి.

 1976లో మొదటిసారి ఎన్టీఆర్, కృష్ణ మధ్య పోటీ.. ఎవరు గెలిచారో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి.

ఇదే సమయంలో ఈ సినిమా విడుదలైన మరునాడు అంటే మార్చి 23వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఇద్దరు మొనగాళ్లు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే అప్పటివరకూ సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో చేసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే కావడం గమనార్హం.

ఈ క్రమంలోనే అన్నగారు నిర్దోషి సినిమా ముందు సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు మొనగాళ్ళు నిలచి గెలుస్తుందా లేదా అని అందరూ అనుకున్నారు.అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ తో పాటు కాంతారావు కూడా మరో హీరోగా నటించారు.ఇద్దరూ రాజకుమారులూ అయినప్పటికీ కృష్ణ చిన్నప్పుడు తప్పిపోయి అడివిలో పెరుగుతాడు.ఈ ఈ క్రమంలోనే సినిమాలో సోదరులైన కాంతారావు, సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఫైటింగ్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి అని చెప్పాలి.

ఇలా ఎన్టీఆర్ సినిమాకు పోటీగా విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అనే చెప్పాలి.ఇలా మొదటిసారి పోటీ పడ్డ ఇద్దరు హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube