అది లక్ష రూపాయ‌ల విలువైన గొడుగు.. దాని సీక్రెట్ తెలిస్తే న‌వ్విపోతారు!

అది లక్ష రూపాయ‌ల విలువైన గొడుగు.. దాని సీక్రెట్ తెలిస్తే న‌వ్విపోతారు!

రెండు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌లు కలిసి ఇలాంటి ఒక విచిత్ర‌మైన‌ గొడుగు (Gucci Adidas Collaboration Umbrella)ను లక్ష రూపాయలకు విక్రయిస్తున్నాయి, ప్రపంచంలో ఇది అత్యంత ఖ‌రీదైన గొడుగా చెబుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఉపయోగం లేని ఈ గొడుగు గురించి ప్రస్తుతం చైనా సోషల్ మీడియా సైట్ వీబోలో చర్చ జరుగుతోంది.

 Umbrella Is Being Sold For 1 Lakh Rupees But Does Not Stop , Umbrella ,  1 Lakh-TeluguStop.com

గూచీ మరియు అడిడాస్‌ల సహకారంతో విక్ర‌యిస్తున్న ఈ గొడుగు చైనాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ గొడుగు 11,100 యువాన్లకు అంటే భారత కరెన్సీలో దాదాపు ఒక‌ లక్ష 27 వేల రూపాయలకు విక్ర‌యిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

చైనా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వీబోలో ఈ హ్యాష్‌ట్యాగ్ వచ్చిన వెంటనే 140 మిలియన్ల మంది ఈ గొడుగును చూశారు.ఈ గొడుగు వాన నుంచి ర‌క్ష‌ణ ఇవ్వ‌ద‌ని, ఎండలో నీడ నివ్వ‌ద‌ని, కేవ‌లం ఫ్యాషన్ షోగా ఉపయోగపడుతుందని ఆ పోస్ట్ లో స్పష్టంగా రాశారు.

ఈ ఉత్పత్తిని గొడుగు కేట‌గిరీలో వర్గీకరించారు.కానీ ఇది గొడుగుకు ఉండాల్సిన‌ లక్షణాలను కలిగి ఉండదు.ఈ గొడుగు ఇటలీలో తయారు చేశారు.ఇది 8 క‌డ్డీల‌ను కలిగి ఉంది.

వీటిని చెక్క హ్యాండిల్‌పై రూపొందించారు.ఆకుపచ్చ మరియు ఎరుపు రంగుల వెబ్‌లను తొడ‌గ‌డం ద్వారా ఈ గొడుగు రూపాన్ని పూర్తి చేసారు.

ఈ గొడుగుకు పైన అడిడాస్ లోగో దిగువన‌ హ్యాండిల్‌పై గూచీని లోగో క‌నిపిస్తాయి.గూచీ వెబ్‌సైట్ తెలిపిన వివ‌రాల ప్రకారం ఈ గొడుగు వాన నుంచి ర‌క్ష‌ణనివ్వ‌దు.

అలంకరణ కోసం ఉపయోగించవచ్చు.చైనాలో ఈ రెండు బ్రాండ్‌లపై ట్రోలింగ్ జరుగుతోంది.

ప్రాక్టికల్‌గా ఆలోచించలేని ఇలాంటి బ్రాండ్‌కి డబ్బులు ఎందుకు చెల్లించాలని చాలామంది ప్ర‌శ్నిస్తున్నారు.దీనికంటే లోకల్ గొడుగు కొనుక్కోవ‌డం బెట‌ర్ అని నెటిజ‌న్లు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube