తులసి చెట్టుతో భవిష్యత్ తెలుసుకోవచ్చా?  

Tulasi Plant Predict Your Future -

మన దేశంలో తులసి చెట్టు లేని ఇల్లు ఉండదు.హిందువులు తులసి చెట్టును అత్యంత పవిత్రంగా భావిస్తారు.

తులసికి ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను ఎంతో విశిష్ట స్థానం ఉంది.తులసి చెట్టు ఇంటిలో ఉంటే మంచి జరుగుతుందని హిందువులకు అపారమైన నమ్మకం.

Tulasi Plant Predict Your Future-Devotional-Telugu Tollywood Photo Image

అందుకే ప్రతి ఒక్కరు ఇంటిలో తులసి చెట్టును పెంచుతూ ప్రతి రోజు పూజలు చేస్తారు.

తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అంతేకాక తులసి చెట్టుతో భవిష్యత్ కూడా తెలుసుకోవచ్చట.అది ఎలాగో తెలుసుకుందాం.

తులసి చెట్టు ఆకులు, కొమ్మలు హఠాత్తుగా రాలిపోవడం,తులసి సహజ రంగును కోల్పోవటం వంటి సంకేతాలు భవిష్యత్ గురించి చెప్పుతాయి.

తులసి చెట్టు పచ్చగా కళకళలాడుతూ ఉంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది.

ఆ ఇంటిలో ఎటువంటి సమస్యలు ఉండవు.తులసి చెట్టు పచ్చగా ఉంటే ఆ ఇంటిలో ఐశ్వర్యం ఉండటమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది.

తులసి చెట్టు ఆకులు ఒక్కసారిగా ఎండిపోవడం లేదా రాలిపోవడం జరిగితే ఆ ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు సంకేతం.తులసి ఆకులు రంగు మారితే ఆ ఇంటిలో ఎదో అనర్ధం జరుగుతుందని సంకేతం.

కాబట్టి తులసి చెట్టును భక్తితో పూజించటమే కాకుండా ఆ చెట్టులో వచ్చే మార్పులను కూడా గమనిస్తూ ఉండాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube