టీఆర్ఎస్ కు ఓకే షర్మిల  పార్టీ సంగతేంటి పీకే ? 

తెలంగాణ లో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల 2023 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే నమ్మకం పెట్టుకున్నారు.

  పార్టీలో చేరికలు లేకపోయినా ఎన్నికలకు ముందు చేరికలు ఉండడంతో పాటు , ప్రజల్లో తమకు ఆదరాభిమానాలు పుష్కలంగా ఉంటాయని నమ్ముతున్నారు.

అసలు తెలంగాణలో షర్మిల పార్టీకి పెద్దగా బేస్ లేకపోయినా, ఆమె మాత్రం తాము అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెబుతూ వస్తుండడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి .షర్మిల పార్టీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అండ దండలు ఉన్నాయని , ఆయన సలహాలు ,సూచనలతో షర్మిల పార్టీ ముందుకు వెళ్తుందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది.దీనికి తోడు  ప్రశాంత్ కిషోర్ తన సోదర సమానుడు అని గతంలోనే ప్రకటించారు.

ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగి షర్మిల పార్టీకి రాజకీయ వ్యూహాలు అందిస్తున్నాయి .పీకే టీం సలహాలతో నే షర్మిల పాదయాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతలను ప్రశాంత్ కిషోర్ టీమ్ తీసుకుందని,  ఈ మేరకు ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తో కేసీఆర్  భేటీ అయ్యారని , అలాగే ప్రశాంత్ కిషోర్ టీమ్ ప్రగతి భవన్ లో  కేసీఆర్ తో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.

ఇక టీఆర్ఎస్ కు సంబంధించి  పీకే టీమ్ రంగంలోకి దిగడం , సర్వేలు నిర్వహించడం ఇలా అన్ని విషయాల్లోనూ రంగంలోకి దిగిపోయారు.దీంతో షర్మిల పార్టీ సంగతి ఏంటి అనే విషయం చర్చకు వస్తోంది.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే షర్మిల పార్టీ సంగతి పీకే పక్కన పెట్టేసినట్టు గానే కనిపిస్తున్నారు.

Advertisement

ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?...
Advertisement

తాజా వార్తలు