సోషల్ మీడియాపై టీఆర్ఎస్ నజర్...అసలు వ్యూహం ఇదేనా?

సోషల్ మీడియాపై టీఆర్ఎస్ నజర్…అసలు వ్యూహం ఇదేనా?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం ఇటు బీజేపీ, కాంగ్రెస్  పార్టీలు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.

 Trs Look At Social Media  Is This The Real Strategy, Telangana Politics, Trs Par-TeluguStop.com

అయితే ప్రస్తుతం చాలా వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియానే ప్రభుత్వాల ఏర్పాటులో కావచ్చు, రాజకీయ పార్టీల గెలుపులో కావచ్చు కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి ఉంది.అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు సోషల్ మీడియాలో తమ పార్టీని బలపరచడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కి సోషల్ మీడియా పరంగా బీజేపీ పార్టీ సవాల్ విసురుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటి వరకు జరిగిన చాలా ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు సోషల్ మీడియానే పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించిందన్న విషయం తెలిసిందే.

కేసీఆర్ కూడా చాలా మీడియా సమావేశాల్లో వాట్సాప్ యూనివర్సిటీ అని ప్రత్యేకంగా ప్రస్తావించారంటే సోషల్ మీడియా ఎంతలా ప్రభుత్వాలకు సైతం దడ పుట్టిస్తుందో మనం అర్ధం చేసుకోవచ్చు.అందుకే టీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా సోషల్ మీడియాను బలపరిచే విధంగా ఇప్పటికే టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం టీఆర్ఎస్ యువకులతో ఇప్పటికే సమావేశాలు మొదలు పెట్టింది.

ప్రస్తుతం అన్ని రకాలుగా పటిష్టంగా ఉన్నామని భావించుకున్న టీఆర్ఎస్ అధిష్టానం ఇక ఈ విషయంపై కూడా దృష్టి పెట్టింది.బీజేపీ కూడా టీఆర్ఎస్ కు పోటాపోటీగా పెద్ద ఎత్తున క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.

ప్రస్తుతం క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను చూస్తుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చాలా హాట్ హాట్ గా సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఈ సోషల్ మీడియా వార్ ఎవరిది పైచేయి అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube