కేసీఆర్‌కు షాక్ ఇస్తున్న పార్టీ వ‌ర్గాలు.. ఏం జ‌రుగుతోంది..?

కేసీఆర్‌కు షాక్ ఇస్తున్న పార్టీ వ‌ర్గాలు.. ఏం జ‌రుగుతోంది..?

తెలంగాణ ఉద్యమంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు.ఎన్నో ఉద్య‌మాలు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు, ఆందోళ‌న‌లు అరెస్టుల‌తో చివ‌ర‌కి తెలంగాణ సాధించుకున్నారు.

 Trs Leaders Jai Ntr Slogans On Ntr Birthday,senior Ntr,trs Leaders,ntr Birthday,-TeluguStop.com

ఇక ఉద్య‌మంలో క‌ష్ట‌ప‌డిన వ‌రికి ప‌ద‌వులు వస్తాయ‌ని, గుర్తింపు వ‌స్తాయ‌ని ఆశించిన చాలా మందికి నిరాశే మిగిలింద‌ని చెప్ప‌వ‌చ్చు.కాగా ఉద్య‌మాన్ని వ్య‌తిరేకించిన వాళ్లు పార్టీలో చేరి అన్ని ప‌ద‌వులు అనుభ‌విస్తున్నారు.

వీళ్ల‌కు బంగారు తెలంగాణ బ్యాచ్ గా పేరు పెట్టుకున్నారు.తుమ్మల, తలసాని, కడియం, ఎర్ర‌బెల్లి ఇలా ఎంతో మందికి పార్టీలో చేర‌గానే మంత్రిపదవులు దక్కాయి.

కానీ.మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకులకు క‌నీసం గుర్తింపు కూడా ల‌భిచ‌లేదు.

గులాబీ బాస్ ని ఎదిరించే ధైర్యం లేదు.ఒక్క‌డో ఒక చోట ఓ నాయ‌కుడు స్వ‌రం పెంచినా ప‌ట్టించుకోక‌పోవ‌డం.

ఏదైనా ఆరోప‌ణ అంట‌గ‌ట్టి బ‌య‌ట‌కి పంప‌డం తెలిసిందే.

ఇక బంగారు తెలంగాణ బ్యాచ్ (బీటీ బ్యాచ్) కి ఉద్య‌మ నాయ‌కుల‌కు ఈ రెండు వ‌ర్గాల‌కు ప్ర‌చ్చ‌న్న యుద్దం జ‌రుగుతుంద‌నే చెప్పాలి.

ఉద్య‌మ స‌మ‌యంలో ప‌డిన క‌ష్టాల‌కు ప్ర‌తిఫ‌లం ద‌క్క‌కుండా ఎవ‌రో ప‌దవులు అనుభ‌విస్తుడ‌టంతో ర‌గిలిపోతున్నారు.అప్పుడ‌ప్పుడూ కొంత‌మంది నాయ‌కులు స్వ‌రం పెంచినా స‌ద్దుమ‌ణిగేలా చేయండం తెలిసిన విష‌య‌మే.కాగా రీసెంట్ గా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాల్లో టీఆర్ఎస్ నేత‌లు తెగ అడావుడి చేశారు.ఇందులో బీటీ బ్యాచ్ నేత‌లే ఎక్కువ‌గా హాజ‌ర‌య్యారు.

అయితే తెలంగాణ వ‌చ్చాక ఎక్కువ‌గా వినిపించే నినాదాలు జై తెలంగాణ‌. జై కేసీఆర్.

కానీ ఇప్పుడు బీటీ బ్యాచ్ మ‌రో నినాదం తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు.ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా జై ఎన్టీఆర్ అన‌డం విశేషం.

Jai Ntr, Kcr, Ntr, Senior Ntr, Trs-Politics

అయితే బీటీ బ్యాచ్ ఇలా అన‌డానికి కూడా ఓ కార‌ణం ఉంద‌ని వినిపిస్తోంది.హైద‌రాబాద్ లో ఉన్న ఓ సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించడానికి ఓ స్కెచ్ అని తెలుస్తోంది.అయితే ఎప్పుడూ లేని విధంగా బీటీ బ్యాచ్ ఇలా అన‌డంపై ఆస‌క్తిగా మారింది.అయితే ఇప్ప‌టికీ బీటీ బ్యాచ్ కి ఎన్టీఆర్ పై అభిమానం, అలాగే సంద‌ర్భం కూడా రావ‌డంతో గ‌ట్టిగానే వినిపిస్తున్నారు.

ఈ కారణంతోనే ఎన్టీఆర్ శతజయంతిని నిర్వహించటంలో కొందరునేతలు కీలక పాత్రను పోషించారు.ఈ నేతల్లో అత్యధికులు ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కావటం.వారిలో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే కావటం గమనార్హం.మనసులో ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు కాలం కూడా కలిసి రావటంతో అస్సలు తగ్గకుండా.

ఎన్టీఆర్ శత జయంతిని ధూంధాంగా నిర్వహించటంతో పాటు గులాబీ పార్టీకి.జై తెలంగాణ.

జై కేసీఆర్.జై ఎన్టీఆర్ అన్న కొత్త నినాదాన్ని తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి ఈ నినాదం ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తుందో చూడాలి మ‌రి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube