ఎన్టీఆర్ కోసం అమెరికా బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ కథ  

Trivikram and Jr NTR Movie sets in America Backdrop, Tollywood, Telugu Cinema, South Cinema, RRR Movie, Nandamuri Fans - Telugu America Backdrop, Nandamuri Fans, R Ntr, Rrr Movie, South Cinema, Telugu Cinema, Tollywood, Trivikram

పాన్ ఇండియా మూవీఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి.

TeluguStop.com - Trivikram And Jr Ntr Movie Sets In America Backdrop

కథ కూడా రెడీ అయిపొయింది.ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగించుకొని తారక్ ఎప్పుడు వస్తే అప్పుడు సెట్స్ పైకి వెళ్ళిపోతారు.

ఇక ఎన్ఠీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమా రిలీజ్ వరకు వేచి చూడకుండా వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.

TeluguStop.com - ఎన్టీఆర్ కోసం అమెరికా బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ కథ-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎన్టీఆర్ సినిమా పూర్తిగా అమెరికా నేపధ్యంలో తెరకెక్కబోతుంది అని చెప్పుకుంటున్నారు.అమెరికాలో మొదలైన కథ ఇండియాలో ముగుస్తుంది అని సమాచారం.

ఈ నేపధ్యంలో మెజారిటీ షూటింగ్ అమెరికాలో జరుగుతుందని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమా ద్వారా వెస్ట్రన్ కల్చర్ ని ఎలివేట్ చేయడంతో పాటు తన సినిమాలలో కనిపించే కుటుంబం బంధాలకి పెద్దపీట వేసే విధంగా కథనం ఉండబోతుంది అని టాక్.

సినిమాలోఎన్టీఆర్ పాత్ర పెద్ద బిజినెస్ టైకూన్ కొడుకుగా కనిపిస్తుందని తెలుస్తుంది.అయితే త్రివిక్రమ్ గ్రామీణ నేపధ్యంలో, ఫామిలీ బాండింగ్ కథలు తీసుకున్నప్పుడు మంచి హిట్స్ కొట్టాడు.అజ్ఞాతవాసి సినిమాని చాలా రిచ్ గా ప్లాన్ చేసి చేతులు కాల్చుకున్నాడు.త్రివిక్రమ్ కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమా అనే రికార్డుని మూటగట్టుకున్న చిత్రం అది.మరి ఎన్టీఆర్ ని మొదట రాయలసీమ తీసుకెళ్లి హిట్ కొట్టిన త్రివిక్రమ్ ఇప్పుడు అమెరికా తీసుకెళ్తే మరో అజ్ఞాతవాసి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ భయపడుతున్నారు.మరి త్రివిక్రమ్ తన కథ, మాటలతో మాయ చేస్తాడా లేక మరోసారి తప్పుచేసి బోర్లా పడతాడా అనేది చూడాలి.

#Trivikram #R NTR #Nandamuri Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube