ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న రాజమౌళి.. ఏం జరిగిందంటే?

Tollywood Star Director Rajamouli Suffering With Viral Fever

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.రాజమౌళి విశ్రాంతి లేకుండా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటూనే సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.

 Tollywood Star Director Rajamouli Suffering With Viral Fever-TeluguStop.com

అయితే ఈ స్టార్ డైరెక్టర్ అస్వస్థతకు గురయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.రాజమౌళి సన్నిహితులు ప్రస్తుతం జక్కన్న వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నాడని చెబుతున్నారు.

వైరల్ ఫీవర్ వచ్చినా ఇంటికే పరిమితమై జక్కన్న చికిత్స చేయించుకుంటున్నారని తెలుస్తోంది.తాను రెస్ట్ తీసుకుంటే సినిమా సంబంధిత పనులు ఆలస్యమవుతాయని భావించి రాజమౌళి విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు.

 ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న రాజమౌళి.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్లు రాకూడదని ఆరోగ్యం సహకరించకపోయినా జక్కన్న జనని సాంగ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో జక్కన్న నీరసంగా కనిపించిన విషయం తెలిసిందే.

అయితే జక్కన్న డేడికేషన్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

Rajamluli, Janani, Rajamouli, Rajamouliun, Ram Charan, Rrr, Rrr Pre, Views-Movie

మరోవైపు సోషల్ మీడియాలో జనని సాంగ్ తెగ వైరల్ అవుతోంది.తెలుగులో జనని సాంగ్ కు 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.మొత్తం 10 భాషల్లో సంక్రాంతి కానుకగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది.

అతి త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Rajamluli, Janani, Rajamouli, Rajamouliun, Ram Charan, Rrr, Rrr Pre, Views-Movie

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచాలని రాజమౌళి అనుకుంటున్నారు.ప్రేక్షకులను అబ్బురపరిచే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.ఈ సినిమాకు పని చేసిన హీరోలు, డైరెక్టర్, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికాలకు మాత్రమే 150 కోట్ల రూపాయలు ఖర్చైందని సమాచారం.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలకు చరణ్, ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని ఇప్పటికే రిలీజైన టీజర్లను పరిశీలిస్తే అర్థమవుతోంది.

#Ram Charan #Rrr #Views #RRR #Janani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube