ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెల

కరోనా కారణంగా దాదాపు 20 నెలల పాటు తెలుగు సినిమా లతో పాటు ఇతర ఏ భాషల సినిమాలు కూడా విడుదల అవ్వలేదు.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాల సందడి మొదలైంది.

గత రెండు నెలలుగా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.అయితే చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పెద్ద సినిమాల కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

పెద్ద సినిమాలు వచ్చే ఏడాది ఆరంభం నుండి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం అందుతోంది.తెలుగు సినిమాలు ఇప్పటికే బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు దక్కించుకున్న విషయం మనం చూశాం.

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు లేకపోవడం నిరాశ కలిగిస్తుంది గడిచిన నాలుగు వారాలుగా అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి.

Advertisement

అందులో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయింది.దాంతో గడిచిన మూడు నాలుగు వారాలు గా టాలీవుడ్ బాక్సాఫీస్ వెల వెలబోతోంది.అసలు వసూళ్లు లేక థియేటర్లు మెయింటెనెన్స్ కూడా రావడం లేదంటే యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో ఏపీలో అతి తక్కువ టికెట్ చార్జీలు ఉండటం మరింతగా వారికి ఇబ్బంది కలిగిస్తుంది.వచ్చే వారం తో అయినా లోటు భర్తీ అవుతుందేమో చూడాలి.

ఎందుకంటే వచ్చేవారం నందమూరి బాలయ్య హీరోగా బోయ పాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన అఖండ సినిమా విడుదల కాబోతుంది.ఆ తర్వాత పుష్ప ఆ తర్వాత వరుసగా సినిమాలు రాబోతున్నాయి.

కంటిన్యూస్గా పెద్ద సినిమా లు టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నాయి.ఈ నాలుగు వారాల వేల వేల ముందు ముందు నాలుగు నెలల వరకు గల గల గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?...
Advertisement

తాజా వార్తలు