ఆ ఇంట్లోకి వచ్చేవారికి టాయ్‌లెట్‌ స్వాగతం

భారతీయులు వాస్తు పాటిస్తూ ఇంటి నిర్మాణాలను చేపడతారు.ఇంటి గుమ్మం, కిటికీలు, పూజగది, వంట గది ఇలా అన్నీ సరైన దిశలో ఉండేలా ముందే పక్కాగా ప్లాన్ వేస్తారు.

 Toilet‌ Welcomes Those Who Come Into That House , House , Toilet , Viral Latest , News Viral , Social Media , Toilet‌ Welcomes-TeluguStop.com

అయితే విదేశాలలో ఇటువంటి నిబంధనలు పట్టించుకోక పోయినా, బెడ్‌రూమ్, కిచెన్ వంటి అమరికగా ఓ ప్లాన్ ప్రకారం ముచ్చటగా కట్టుకుంటారు.ప్రస్తుతం ఆర్కిటెక్టులు విదేశాలతో పాటు మన దేశంలోనూ కళ్లు చెదిరే ఎన్నో ఇళ్లను కడుతున్నారు.

అయితే కొందరు స్వయంగా దగ్గరుండి ఇళ్లు కట్టించుకుంటుంటారు.ఇంకొందరు తమకు అనువైన నగరంలో, అన్ని సదుపాయాలు ఉన్న చోట అప్పటికే కట్టి ఉంచిన ఇల్లును కొనుగోలు చేస్తుంటారు.

 ఆ ఇంట్లోకి వచ్చేవారికి టాయ్‌లెట్‌ స్వాగతం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే కోవలో కొందరు ఇంటి కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతుండగా ఓ ఇల్లు వెరైటీగా కనిపించింది.ఇంట్లోకి అడుగు పెట్టే వారికి టాయిలెట్ స్వాగతం పలకడం అందరినీ విస్మయపరుస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రాంతంలో అమ్మకానికి ఓ ఇల్లు ఉందంటూ రెడ్డిట్‌లో ప్రకటన వచ్చింది.

ఇది నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.ఇది Zillow అనే హౌస్ హంటింగ్ వెబ్‌సైట్‌లో షేర్ చేయబడింది.పెన్సిల్వేనియాలోని న్యూటౌన్‌లోని డర్హామ్ రోడ్‌లో ఉన్న ఈ ఇంటి ధర ధర 4.20 లక్షల డాలర్లు (రూ.3.25 కోట్లు)గా నిర్ణయించారు.త్రీ బెడ్‌రూమ్‌ల ఇల్లు అది.అయితే ఫొటోలను పరిశీలిస్తున్న క్రమంలో అవి చూస్తున్న వారంతా అవాక్కవుతున్నారు.మెట్ల మార్గంలో ఇల్లు నిర్మాణం చేసిన వారు టాయిలెట్‌ను ఏర్పాటు చేశారు.ఒక గదిలో పాత యూనిఫాం కూడా ఒక మూలలో వేలాడదీయబడింది.అసలే డేగ దృష్టి గల నెటిజన్లు ఇవన్నీ గమనించారు.కొంపతీసి హారర్ సినిమాకి ఇల్లు ఏమైనా సెటప్ చేశారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొందరు మెట్లపైన టాయిలెట్ కొత్త డిజైన్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.ఏదేమైనా ఈ ఇల్లు నెట్టింట వైరల్‌గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube