సాయంత్రం స్నాక్స్‌లో ఇవి తింటే..మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

సాధార‌ణంగా పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రికీ సాయంత్రం వేళ స్నాక్స్ తినే అల‌వాటు ఉంటుంది.

సాయంత్రం నాలుగైదు గంట‌లు అయిందంటే ఏదో ఒక స్నాక్స్ పొట్ట‌లో పాడాల్సిందే.

అందుకే ఆ టైమ్‌కు ప‌కోడీలో, మిర్చి బ‌జ్జీలో, వ‌డ‌లో, బోండాలో, స‌మోసాలో ఇలా ఏవో ఒక‌టి చేసుకుని తింటుంటారు.అయితే ఇలాంటి ఆయిల్ ఫుడ్స్‌ చాలా రుచిగా ఉంటాయి.

కానీ, ఆరోగ్యానికి ఏ మాత్రం మేలు చేయ‌వు.అందుకే సాయంత్రం స్నాక్స్ లో రుచితో పాటు ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాల‌నే తీసుకోవాలి.

మ‌రి అలాంటి ఆహారాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.స్వీట్ కార్న్ ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది.

Advertisement

సాయంత్రం వేళ ఉడికించిన స్కీట్ కార్న్ తీసుకుంటే గుండె పనితీరు మెరుగు ప‌డుతుంది.ఒత్తిడి, టెన్ష‌న్‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

ఎముక‌లు దృఢ‌ప‌డ‌తాయి.ఇక ఫాస్ట్‌గా డైజెస్ట్ అయ్యే ఈ స్వీట్ కార్న్ శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని కూడా అందిస్తుంది.

సాయంత్రం వేళ తీసుకోద‌గిన బెస్ట్‌ స్నాక్స్ లో శ‌న‌గ‌లు ఒక‌టి.అది కూడా పొట్టుతో ఉన్న‌ శ‌న‌గల‌ను పెనంపై వేయించి స్నాక్స్‌లో తింటే శ‌రీరానికి కావాల్సిన ఎన‌ర్జీతో పాటుగా అనేక పోష‌క విలువ‌లు ల‌భిస్తాయి.శ‌న‌గ‌ల‌కు బ‌దులుగా వేరుశనగలు అయినా వేయించి తీసుకోవ‌చ్చు.

సాయంత్రం స్నాక్స్‌లో పండ్ల‌ను కూడా తీసుకోవ‌చ్చు.ముఖ్యంగా యాపిల్‌, బ్లూ బెర్రీలు, చెర్రీ, పుచ్చకాయ, ద్రాక్ష‌, కివి ఇలాంటి పండ్లు తీసుకోవాలి.లేదా ఈ పండ్ల‌తో చేసిన స‌లాడ్స్ అయినా స్నాక్‌గా తినొచ్చు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!...
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?...

అలాగే ది బెస్ట్ ఈవెనింగ్ స్నాక్స్‌లో మొల‌క‌ల చాట్‌ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.అవును, సాయంత్రం వేల మొల‌క‌ల‌తో త‌యారు చేసిన చాట్ తీసుకుంటే.ప్రోటీన్‌, ఫైబ‌ర్‌తో పాటు అనేక పోష‌కాలు శ‌రీరానికి ల‌భిస్తాయి.

Advertisement

పైగా ఈ మొల‌కల చాట్ రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.సాయంత్రం స్నాక్స్‌లో డ్రై ప్రూట్స్ కూడా తినొచ్చు.

బాదంపప్పు, కిస్మిస్‌, జీడిప‌ప్పు, వాల్‌నట్స్‌, పిస్తా, అంజీర్‌ వంటి డ్రై ఫ్రూట్స్ శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందించ‌డంతో పాటుగా ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తాయి.

తాజా వార్తలు