పుష్ప హిందీలో సక్సెస్ కావడానికి కారణమైన ఈ వ్యక్తి ఎవరో తెలుసా?

పుష్ప హిందీలో సక్సెస్ కావడానికి కారణమైన ఈ వ్యక్తి ఎవరో తెలుసా?

బన్నీ నటించిన పుష్ప ది రైజ్ హిందీలో రిలీజవుతుందని ప్రచారం జరిగిన సమయంలో చాలామంది ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.సౌత్ హీరోల సినిమాలకు హిందీలో కలెక్షన్లు రావని కామెంట్లు వినిపించాయి.

 The Person Behind Pushpa Hindi Version Success Details Here ,  Pushpa , Hindi Ve-TeluguStop.com

ఏకంగా 1600 స్క్రీన్లలో పుష్ప సినిమాను హిందీలో విడుదల చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.తొలిరోజు ఈ సినిమా కలెక్షన్లు హిందీలో 2 కోట్ల రూపాయల లోపే ఉండవచ్చని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు.

అయితే అందరి అంచనాలకు భిన్నంగా పుష్ప సినిమా ఏకంగా 80 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు చేసి హిందీలో రికార్డులు క్రియేట్ చేసింది.అయితే పుష్ప సినిమా హిందీలో ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి కూడా కారణమనే సంగతి తెలిసిందే.

పుష్ప హిందీ వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి పేరు శ్రేయాస్ కావడం గమనార్హం.ఇతని పూర్తి పేరు శ్రేయాస్ తాల్పడే కాగా బన్నీ హావభావాలను ఈ వ్యక్తి తన గొంతుతో అద్భుతంగా పలికించాడు.

Allu Arjun, Bollywood, Hindi, Pushpa Hindi, Tollywood-Movie

ఈ గొంతు వల్ల హిందీలో శ్రేయాస్ పేరు మారుమ్రోగుతోంది.అయితే శ్రేయాస్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు.కెరీర్ తొలినాళ్లలో శ్రేయాస్ ను కొంతమంది వాయిస్ ఆర్టిస్ట్ గా పనికిరావని విమర్శలు చేశారు.తన పని మాత్రమే తాను చేశానని పుష్పరాజ్ సక్సెస్ గురించి శ్రేయాస్ కామెంట్లు చేశారు.

పుష్ప హిందీ వెర్షన్ సక్సెస్ లో తన పాత్ర ఏమీ లేదని శ్రేయాస్ వెల్లడించడం గమనార్హం.

Allu Arjun, Bollywood, Hindi, Pushpa Hindi, Tollywood-Movie

తాజాగా పుష్ప మూవీ హిందీ ఓటీటీలో కూడా అందుబాటులోకి రావడం గమనార్హం.అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని తెలుస్తోంది.బన్నీ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడని బన్నీ అద్భుతంగా హావభావాలు ఇవ్వడంతో తన పని తేలికైందని శ్రేయాస్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube