వాట్సాప్‌లో పొర‌పాటున పెట్టిన స్టేట‌స్ కోసం స‌రికొత్త ఫీచ‌ర్‌

వాట్సాప్‌లో పొర‌పాటున పెట్టిన స్టేట‌స్ కోసం స‌రికొత్త ఫీచ‌ర్‌

మ‌న జీవితంలో ఇప్పుడు ఓ యాప్ స‌ర్వ సాధార‌ణం అయిపోయింది.ఇంకా చెప్పాలంటే ఈ యాప్ నే మ‌నం రెగ్యుల‌ర్ గా వాడేస్తున్నాం.

 The Newest Feature For Mistaken Status On Whatsapp Details, Whatsapp, Viral News-TeluguStop.com

అన్ని యాప్ ల‌కంటే కూడా ప్ర‌తి ఒక్క‌రికీ చేరువ‌యింది ఏదైనా ఉందా అంటే అది వాట్సాప్ మాత్ర‌మే.నిత్యం వాట్సాప్ లో ఏదో ఒక‌టి మ‌నం చేస్తూనే ఉంటాం.

ఫ్రెండ్స్ తోచాటింగ్ ద‌గ్గ‌రి నుంచి వాట్సాప్ స్టేట‌స్ ల దాకా ప్ర‌తి దానికి మ‌నం వాట్సాప్ నే వాడుతుంటాం.అత్యంత గోప్య‌త‌గా మ‌న స‌మాచారం ఉంటుంద‌ని న‌మ్మేది ఒక్క వాట్సాప్‌ను మాత్ర‌మే.

అయితే ఇప్పుడు వాట్సాప్ కూడా చాలా టెక్నాల‌జీని రూపొందిస్తోంది.

వాట్సాప్ లో ఉన్న ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా క్షుణ్ణంగా ప‌రీక్షించి దానికి అనుగుణంగా ఒక వాట్సాప్ ఫీచ‌ర్‌ను రూపొందిస్తోంది.

అయితే మ‌నం ఒకిరికి పంపే మెసేజ్ ను పొర‌పాటున పంపిస్తుంటాం.ఇది ప్ర‌తి ఒక్క‌రికీ స‌ర్వ సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే.

అయితే ఇదే కొన్ని సార్లు ఇబ్బందుల్లో ప‌డేస్తోంది.అలాగే కొన్ని సార్లు ఏమరుపాటులో కూడా స్టేటస్‌లు పెట్టేస్తాం.

పెట్ట‌కూడ‌నివి పెట్టిన‌ప్పుడు మ‌న‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయి.అయితే దీన్ని డిలీట్ చేయాలంటే స్టేటస్‌లోకి వెళ్లి పైన ఉన్న మూడు చుక్క‌ల మీద ప్రెస్ చేసిన త‌ర్వాతే డిలీట్ ఆప్ష‌న్ వ‌స్తుంది.

Android, Deletewhatsapp, Status, Whatsapp, Whatsapp Status, Whatsapp Undo, Whats

ఇంత స‌మ‌యం ప‌ట్ట‌కుండా వెంట‌నే దాన్ని డిలీట్ చేసేందుకు ఇప్పుడు వాట్సాప్ అండూ బటన్ ను తీసుకురానుంది.దీని ద్వారా పొర‌పాటున పెట్ట‌ిన స్టేటస్ ల‌ను వెంటనే డిలీట్ చేయొచ్చు.ఈ కొత్త ఫీచ‌ర్ రెగ్యుల‌ర్ గా వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టే వారికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుందని చెబుతున్నారు.ఈ అన్ డూ బ‌ట‌న్ మీద క్లిక్ చేయ‌గానే వెంట‌నే ఆ స్టేట‌స్ డిలీట్ అయిపోతుంది.

కాగా ఈ వెర్ష‌న్ ను ముందుగా ఐవోఎస్‌ వెర్షన్‌లో తీసుకు వ‌స్తార‌ని తెలుస్తోంది.దీని తర్వాతే ఆండ్రాయిడ్‌ వెర్షన్ లో అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube