ఉప్పెన దర్శకుడిని భయపెట్టిన సంఘటన.. గట్టిగట్టిగా అరుస్తూ?

ఉప్పెన దర్శకుడిని భయపెట్టిన సంఘటన.. గట్టిగట్టిగా అరుస్తూ?

కొన్ని కొన్ని సార్లు ప్రతి ఒక్కరికి భయపెట్టే సంఘటనలు ఎదురవుతుంటాయి.అవి మంచి విషయంలోనైనా చెడు విషయంలోనైనా సరే భయం అనేది ఒకేలా ఉంటుంది.

కొన్ని సందర్భాలలో అనుకోకుండా కొన్ని భయంకరమైన సంఘటనలు ఎదురవుతుంటాయి.నిజానికి అనుకోకుండా జరిగిన సంఘటనలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఇక అలా అందరి జీవితాల్లో అనుకోని సంఘటనల వల్ల కొన్ని భయాలు ఉంటాయి.ఇదంతా పక్కన పెడితే ఉప్పెన దర్శకుడికి కూడా ఓ సంఘటన బాగా బయటపెట్టిందట.

ఇక ఆ సంఘటనను ఇప్పటికీ కూడా మర్చిపోలేను అంటూ ప్రతిసారి ఈ సంఘటన గుర్తుకు వస్తూనే ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తెలిపాడు.ఇంతకు అదేం సంఘటననో తెలుసుకుందాం.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన బుచ్చిబాబు సనా ఉప్పెన సినిమాతో తనేంటో నిరూపించుకున్నాడు.ఈ ఒక్క సినిమాతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ డైరెక్టర్ గా మారాడు.ఇక ఈయన ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల కోసం కొన్ని కథలు సిద్ధం చేసి ఉంచాడు.

Buchibabu, Ghmc, Hyderabad, Sukumar, Tollywood, Uppena-Movie

ఈ ఏడాది తన దర్శకత్వంలో మంచి ప్రేమకథతో రూపొందిన ఉప్పెన సినిమాను విడుదల చేశాడు బుచ్చిబాబు.ఈ సినిమాతో కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ నటీనటులు పరిచయమయ్యారు.వీరికి కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందించడంతో ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.ఇక బుచ్చిబాబు ఈ సినిమా కంటే ముందు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యుడిగా ఎన్నో నేర్చుకున్నాడు.

Buchibabu, Ghmc, Hyderabad, Sukumar, Tollywood, Uppena-Movie

గోదావరికి చెందిన బుచ్చిబాబు చూడటానికి మామూలు వ్యక్తిగా కనిపిస్తాడు.ఈయన ఉప్పెన సినిమా ముందు క్లాప్ డైరెక్టర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.సుకుమార్ దగ్గర ఆర్య 2, 100% లవ్, వన్ నేనొక్కడినే, కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలలో చేశాడు.ఇక సుకుమార్ సపోర్ట్ తో దర్శకుడిగా అడుగుపెట్టాక బుచ్చిబాబు రేంజ్ మొత్తం మారిపోయింది.

Buchibabu, Ghmc, Hyderabad, Sukumar, Tollywood, Uppena-Movie

ఒక్క సినిమాతోనే ఎంతో అనుభవమున్న దర్శకుడిగా పని చేశాడు.ఇక ఉప్పెన సినిమా తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలను, తన గురువు సుకుమార్ గురించి చాలా విషయాలు పంచుకున్నాడు బుచ్చిబాబు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఉప్పెన సినిమాకు సంబంధించిన చాలా విషయాలు తెలిపాడు.

ఇక సినిమా విడుదలైన ఆరవ రోజు తాను ఉదయానే ఆఫీస్ కి వెళ్తున్న సమయంలో జిహెచ్ఎంసి చెత్త తీసుకుని వెళ్లే వాహనంలో ఒక నలుగురైదుగురు కుర్రాళ్ళు ఉన్నారని.

వాళ్లు చాలా మాస్ గా ఉన్నారని తెలిపాడు.ఇక తన కారుకి అడ్డంగా రావటంతో భయపడ్డానని.వెంటనే వాళ్ళు అన్నా సినిమా అదిరిపోయింది అంటూ గట్టి గట్టిగా అరిచారని తెలిపాడు.వెనకాల ట్రాఫిక్ జామ్ అవుతున్న కూడా వాళ్ళు సెల్ఫీ అన్న అంటూ బాగా అరిచారని.

అది చాలు అనుకున్నానని తెలిపాడు బుచ్చిబాబు.ఇప్పటికీ ఆ సంఘటన మర్చిపోనని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube