పేదవాడి సంతోషానికి విలువ కట్టలేం.. సైకిల్ కొన్నాక వీరి రియాక్షన్ చూస్తే ఫిదా!

పేదవాడి సంతోషానికి విలువ కట్టలేం.. సైకిల్ కొన్నాక వీరి రియాక్షన్ చూస్తే ఫిదా!

ఎన్ని ఆస్తులు ఉన్నా కొందరు ధనికులు సంతోష పడలేరు.ఏదో లోటు వారి సంతోషాన్ని మింగేస్తుంది.

 The Happiness Of The Poor Cannot Be Valued  Fida If You See Their Reaction After-TeluguStop.com

అయితే కొందరు పేదవారు డబ్బులు గుట్టల కొద్దీ లేకపోయినా సంతోషంగా ఉంటారు.ఇతరులకు కొన్ని విషయాలు చాలా చిన్నగా అనిపించినా వీరికి మాత్రం అవే విషయాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి.

ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే, తాజాగా ఒక తండ్రి, కొడుకు సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్న సందర్భంగా ఫుల్ ఖుషీ అయ్యారు.తమ ఆనందానికి అవధులే లేవు అన్నట్లుగా వారు తమ తమ సైకిల్ చూసి గెంతులు వేశారు.

తండ్రి సైకిల్‌కి పూలమాల వేసి, దానికి దండం పెట్టుకుంటూ కనిపించాడు.ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్న తర్వాత ఒక వ్యక్తి, అతని కొడుకు అమూల్యమైన రియాక్షన్ చూసి ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ కూడా ఫిదా అయిపోయారు.ఈ వీడియోని ఆ అధికారి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.“ఈ తండ్రీకొడుకులు మెర్సిడెస్-బెంజ్ కొనుగోలు చేసినంత హ్యాపీగా ఉన్నారు.వారి ముఖాలపై ఆనందం చూస్తుంటే ముచ్చటేస్తుంది” అని అవనీష్ ఈ వీడియోకి ఒక క్యాప్షన్ జోడించారు.

కొద్ది గంటల క్రితమే షేర్ చేసిన ఈ వీడియోకి 7 లక్షలకు పైగా వ్యూస్, 63 వేలకు పైగా లైకులు వచ్చాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు బాగా ఎమోషనల్ అవుతున్నారు.మరికొందరు మాత్రం ఇందులో కూడా నెగిటివిటీని పాయింట్ అవుట్ చేస్తున్నారు.“ఇండియాలో ఇలాంటి పేద వాళ్ళు ఇంకా ఉన్నారా, ఆ గుడిసె చూడండి, వారి బట్టలు చూడండి.పేద వారికి ఇళ్లు కట్టించడం ప్రభుత్వం బాధ్యత కానీ ప్రభుత్వ అధికారులకు ఇవేమీ కనిపించవు” అని కామెంట్లు పెడుతున్నారు.మరికొందరు మాత్రం పేద, ధనిక ఇద్దరికీ కష్టాలు ఉంటాయని కాకపోతే జీవితంలో ఎంతగా సంతోష పడుతున్నామన్నదే ముఖ్యమని కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube