అమెజాన్ లోగోకు అర్ధం అదే!

అమెజాన్ లోగోకు అర్ధం అదే!

అమెజాన్ బ్రాండ్ అంటే తెలియనివారు బహుశా ఎవరూ ఉండరేమో.ఆన్ లైన్ లో ఏదన్నా కొనుగోలు చేయాలంటే అందరూ ముందుగా ఈ వెబ్ సైట్ నే ఆశ్రయిస్తారు.

 That S What The Amazon Logo Means , Amazon , Logo , Meaning , Viral Latest News-TeluguStop.com

ఇక మొబైల్ వున్నవారు కూడా దాదాపుగా అమెజాన్ యాప్ లో లాగిన్ అవుతారు.ఈ పేరు ఎంతలా ఫేమస్ అయ్యిందంటే, ప్రస్తుతం కుగ్రామాల్లో కూడా అమెజాన్ సేవలందిస్తూ ఉంది.

అవును, ఆన్ లైన్ షాపింగ్ లో అమెజాన్ కు ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నది.అయితే, ఈ అమెజాన్ బ్రాండ్ పేరు చూసినప్పుడు మనలో కొంతమందికి ఓ డౌట్ వస్తుంటది.అదేమంటే… అమెజాన్ టెక్స్ట్ కింద కింద ఉండే ఆ బాణం గుర్తు దేనికి అర్థం అని?

ఇపుడు దానర్ధం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.కొన్నాళ్ల క్రితం అమెజాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి ‘జెఫ్ బెజోజ్’ని ఇదే విషయంపైన ప్రశ్నించగా దానిగురించి ఆయన చాలా చక్కగా వివరించారు.

దాంతో ఆ గుర్తుపైన వున్న డౌట్స్ అందరికీ క్లియర్ అయ్యాయి.ఇక ఆ అమెజాన్ కింద వున్న బాణం గుర్తుకు అర్ధం ఏమిటంటే, “ఇక్కడ ప్రపంచంలోవున్న అన్ని లభించును.A నుంచి Z వరకు అన్నీ దొరుకుతాయి.” అనే అర్థాన్ని స్ఫురించేలాగా ఈ బాణం గుర్తుని ఉంచామని జెఫ్ బెజోజ్ తెలిపాడు.

Amazon, Amazon Logo, Logo, Latest-Latest News - Telugu

ఇకపోతే జెఫ్ బెజోజ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావడం విశేషం.అయితే అతను ఈ మధ్య తన సి‌ఈ‌ఓ పదవి నుంచి తప్పుకున్నారు.జెఫ్ బెజోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా తన సంస్థకు సి‌ఈ‌ఓగా ఉన్నారు.సంస్థలోని ఇతర భాగాలపై దృష్టి పెట్టేందుకే పదవీవిరమణ చేసారు.సీఈఓ పదవి నుంచి వైదొలిగిన తరువాత ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఇపుడు కొనసాగుతున్నారు.ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం జెఫ్ బెజోస్ నికర విలువ ప్రస్తుతం 203 బిలియన్లు డాలర్లు.2018, నుండి 2020 వరకు బిల్ గేట్స్ నికర విలువ రూ .6.12 లక్షల కోట్లు నుండి రూ .8.58 లక్షల కోట్లు చేరింది.ఫోర్బ్స్ ప్రకారం, అతని సంపద 1998 నుండి 196 బిలియన్ డాలర్లు పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube