తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.కెనడా సాయిబాబా మందిరంలో కార్తీకదీప వేడుకలు

శ్రీ అనఘా దత్త సొసైటీ వారి ఆధ్వర్యంలో కెనడా కాల్గరీ సాయిబాబా మందిరంలో కార్తీకదీప వేడుకలు ఘనంగా నిర్వహించారు.

 

2.అమెరికాలో టీడీపీ నేతల నిరసన

  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను ఉద్దేశించి వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై అమెరికాలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వైసిపి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. 

3.భారత సంతతి మహిళ శాస్త్రవేత్తకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

  భారత సంతతికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వీణ సహజ్  వాలాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది.న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమెను ఎన్ ఎస్ డబ్ల్యు ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డుతో సత్కరించింది. 

4.బైడన్ కు ఒబామా పుట్టిన రోజు శుభాకాంక్షలు

  అమెరికా మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

5.తాలిబన్ల మరో హెచ్చరిక

  ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ప్రభుత్వం మరో ఆంక్షలను విధించింది.మహిళా నటులు ఉండే షోలు, డ్రామాల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. 

6.రష్యాలో కరోనా కలకలం

  రష్యాలో కోవిడ్ 19 మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.ఆదివారం ఒక్కరోజే 1252 మంది మరణించారు. 

7.అమెరికా లో నల్గొండ యువకుడి మృతి

Advertisement

  నల్గొండ జిల్లా కు చెందిన మండలి శేఖర్ ( 25 ) అనే యువకుడు అమెరికాలో మృతి చెందాడు. 

8.నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్

  అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్ ) న్యూజెర్సీలో సాయి దత్త పీఠం తో కలిసి ఉచిత కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించింది. 

9.భారత్ పై యూఎన్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

  నా హృదయం లో సగభాగం భారత్ కె చెందుతుంది అంటూ యుఎన్ మాజీ చీఫ్ బాన్ కీ మూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

10.సూడాన్ ప్రధాన మంత్రిగా మళ్లీ అబ్దల్లా హమ్ దోక్

  సూడాన్ ప్రధాన మంత్రిగా మళ్లీ అబ్ధల్లా హామ్ దొక్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు