తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.అమెరికాలో పీవీ విగ్రహా ప్రతిష్టాపన పై సమావేశం

అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ ఏర్పాటు విషయమై పీవీ శతజయంతి సన్నాహక  సమావేశం కు సన్నాహక కమిటీ సభ్యుడు మహేష్ భిగాల హాజరయ్యారు.

2.పని దినాలపై యూఏఈ ప్రభుత్వం సంచలన నిర్ణయం

పని దినాల పై యూఏఈ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఇక పై వారానికి నాలుగున్నర రోజులే పని దినాలని ప్రకటించింది.

3.దక్షిణాఫ్రికా లో ఒమిక్రాన్ విజృంభణ

దక్షిణాఫ్రికా లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నాయి.గత మూడు రోజులుగా అక్కడ ఒమి క్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ గా తేలుతోంది.

4.ఫేస్ బుక్ పై దావా

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై రోహింగ్య శరణార్థులు కొందరు మోటా ( ఇంతకు ముందు ఫేస్ బుక్ ) కంపెనీ ఫ్లాట్ ఫార్మ్ పై దావా వేశారు.అది తమ జీవితాలను నాశనం చేసిందని 150 బిలియన్ డాలర్ల కు దావా వేశారు.

5.అమెరికాకు చైనా వార్నింగ్

చైనాలోని బీజింగ్ లో వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలంపిక్స్ ను అమెరికా బాయ్ కట్ చేసింది.  దీనిపై చైనా ఘాటుగా  రియాక్ట్ అయ్యింది.అమెరికా చేపట్టిన దౌత్యపరమైన బహిష్కరణ ను చైనా ఖండించింది.దీనిపై ప్రతీకారం తీర్చుకోబోతున్నట్టు హెచ్చరించింది.

6.అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ

బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ ను  దౌత్య సంబంధమైన బహిష్కరణ చేసినట్లు అమెరికా ప్రకటించడాన్ని తాము గౌరవిస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పేర్కొంది.

7.అమెరికాలో సిరివెన్నెల కి తెలుగు వారి నివాళి

Advertisement

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) , ఆట, నాట, నాట్స్ టిటిఏ , టాంటెక్స్ ఆధ్వర్యంలో లో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కి ఘన నివాళి అర్పించారు.

8.2021 ప్రపంచం మొత్తం ఫ్రెంచ్ కమ్యూనిస్ట్

ప్యారిస్ లోని గ్రిని పట్టణ ఉత్తమ మేయర్ గా ఫ్రెంచ్ కమ్యూనిస్ట్ ఫిలిప్ రియో ( 40) ఎంపికయ్యారు.

9.ఫ్రెంచ్ లో ఒమి క్రాన్ ఆంక్షలు

ఫ్రెంచ్ లో ఒమి క్రాన్ ఆంక్షలు విధిస్తూ ప్రధాని జీన్ కాస్తెక్స్ కీలక ప్రకటన చేశారు.ఓ నాలుగు వారాల పాటు నైట్ క్లబ్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

10.47 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్

ప్రపంచ దేశాలను కొత్త కరోనా వేరియంట్ ఒమి క్రాన్ బెంబేలెత్తిస్తోంది.ఈ వైరస్  47 దేశాలకు విస్తరించింది.

Advertisement

తాజా వార్తలు