ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్‌ సమరమా? సంధినా?

ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్‌ సమరమా? సంధినా?

తెలుగు సినీ పరిశ్రమ కోవిడ్‌ కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దాదాపు ఏడాది పాటు షూటింగ్ లు లేకపోవడంతో సినీ కార్మికులు మరియు సినిమా లు సగం పూర్తి కావడం తో నిర్మాతలు.

 Telugu Film Producers Again Meetings With Ap Govt About Theaters,latest News-TeluguStop.com

అవకాశాలు లేక నటీనటులు చాలా ఇబ్బందులు పడ్డారు సినిమా నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు అంతా కూడా సినిమా ల షూటింగ్‌ లు మళ్లీ ప్రారంభం అవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.ఈ సమయం లో నిర్మాతలు తమ సినిమా లను పెద్ద ఎత్తున విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

కోట్లు ఖర్చు పెట్టి సినిమా లు నిర్మించిన నిర్మాతలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నష్టపోవాల్సి వచ్చింది.ఈ ఏడాది ఆరంభంలో ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్ల లో ఉన్న టికెట్ల రేట్లను సవరించిన విషయం తెలిసిందే.

ఆ విషయం గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమ ప్రభుత్వం వద్ద విన్నవించుకుంటూ వస్తోంది.టికెట్ల రేట్లు పెంచడం తో పాటు ప్రత్యేక షో లకు అనుమతి ఇవ్వాలి.

Ap, Ap Theaters, Telugu, Tollywood-Movie

అలాగే సినిమా మొదటి రోజు టికెట్ల విషయం లో నిర్మాత లకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి అన్నట్లుగా నిర్మాత లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ల రేట్లను పెంచే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పింది.అలాగే ప్రత్యేక షో లకు కూడా అనుమతి లేదని వారు ప్రకటించారు.ఏపీ అసెంబ్లీ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి జీవో ని కూడా తీసుకు రావడంతో టాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు ఏం చేయాలా అంటూ సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం కు వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమం చేయాలా లేదంటే సినిమా పరిశ్రమను ఏపీకి తరలించేలా చర్యలు తీసుకోవాలా అంటూ ఇలా ఏదో ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఏపీలో టికెట్ల రేట్లను పెంచే అవకాశం ను పరిశీలిస్తున్నారు.ఒకవేళ కుదరకపోతే కచ్చితంగా టాలీవుడ్ వర్గాల వారు ఏపీ ప్రభుత్వంపై పోరుకు సిద్దం అంటున్నారు.

కోర్టుకు వెళ్లే ఆలోచనలు కూడా ఉన్నాయంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube