కేసీఆర్‌కు జగన్ మీద కోపం వచ్చిందా?

కేసీఆర్‌కు జగన్ మీద కోపం వచ్చిందా?

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిన విషయమే.2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కేసీఆర్ సహకరించారన్న కామెంట్లు వినిపించాయి.అవి నిజమో, అబద్ధమో పక్కన పెడితే పలు సందర్భాలలో సీఎం కేసీఆర్, జగన్ కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పలకరించుకున్నారు.సీఎంగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి కూడా కేసీఆర్ హాజరయ్యారు.

 Telangana Cm Kcr Angry On Ys Jagan,ys Jagan,cm Kcr,telangana,ap Politics,nationa-TeluguStop.com

ఆ తర్వాత ఇద్దరిపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు.

కట్ చేస్తే.

రాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది.ఈ ఎన్నిక కారణంగా కేసీఆర్, జగన్ మధ్య లుకలుకలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఒకవైపు దేశంలో మోదీని కేసీఆర్ వ్యతిరేకిస్తున్న సమయంలో.ఏపీ సీఎం జగన్ మాత్రం మోదీకి మద్దతివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి జగన్ తాను బీజేపీ పక్షం అని మరోసారి బలంగా చాటుకున్నారు.ఈ పరిణామంతో తెలంగాణ సీఎం కేసీఆర్ షాక్ తిన్నారు.

Ap, Cm Kcr, Jagan, National, Telangana, Ys Jagan-Telugu Political News

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్‌కు జగన్ విషయం ఇప్పుడు మింగుడుపడటం లేదు.జగన్ తోడుగా ఉంటే ఢిల్లీ రాజకీయాలను శాసించవచ్చని.జాతీయంగా వెలిగిపోవచ్చునని కేసీఆర్ కలలు కన్నారు.కానీ ఇప్పుడు పొరుగు రాష్ట్రంలోనే తనకు వ్యతిరేకంగా గాలి వీయడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరోవైపు భారతీయ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి ఏపీ ప్రజల మనసును కూడా గెలుచుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.తాము తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే కోరుకున్నాం కానీ ఏపీకి అన్యాయం జరగాలని తమ అభిమతం కాదని వివరిస్తూ ఏపీలోనూ పాగా వేయాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.

అంతేకాకుండా 2024 ఎన్నికల్లో జగన్ మీద తన కోపాన్ని చూపించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది.ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరతాయో కాలమే సమాధానం చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube