రియల్‌ హీరో : సాయం చేసేందుకు లక్షలు ఉండాల్సిన అవసరం లేదని నిరూపించిన ట్యాక్సీ డ్రైవర్‌

లక్షల రూపాయలు ఇంట్లో మూలుగుతున్నా బయట ఒక బిచ్చగాడు గొంతు పోయేలా అరుస్తున్నా కూడా వాడికి బిచ్చం వేయని వారు చాలా మంది ఉన్నారు.

లక్షల్లో మునిగి తేలే వారు రూపాయ రూపాయ కూడబెట్టడం కూడా మనం చూస్తూనే ఉంటాం.

వారు ఎంత చేసినా ఏం చేసినా కూడా డబ్బు గురించే ఆలోచిస్తారు.డబ్బు ఉంటేనే అంతా అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది.

ఇతరులు ఎవరు ఎటు పోతే నాకు ఏంటీ అన్నట్లుగా వారి ఆలోచన తీరు ఉంటుంది.అయితే కొందరు మాత్రం తాము బతకడమే కష్టం అయినా కూడా ఇతరులకు బతుకును ఇచ్చేందుకు సిద్దం అవుతారు.

తాము కాయా కష్టం చేసుకుంటూ కూడా ఇతరులకు సాయంగా నిలుస్తూ ఉంటారు.అలాంటి వారిని రియల్‌ హీరోలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

చైనాకు చెందిన ఈ ట్యాక్సీ డ్రైవర్‌ రీయల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.చైనాకు చెందిన హాన్లీ అనే యువతికి 2014వ సంవత్సరంలో బోన్‌ క్యాన్సర్‌ వచ్చింది.ఆ క్యాన్సర్‌ నుండి క్యూర్‌ అయితే అవ్వగలిగింది కాని ఆమెకు ఒక కాలు తీసేయాల్సి వచ్చింది.

ఆ కాలు తీసేసిన కూడా ఆమె ఏమాత్రం మనో నిబ్బరం మిస్‌ కాకుండా తన చదువును కొనసాగించాలని ఆశించింది.కాని కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది.

దాంతో ఆమె స్కూల్‌కు వెళ్లాలి అంటే కష్టం అయ్యింది.స్కూల్‌ ఉచితమే అయినా ప్రయాణ ఖర్చులు కూడా ఆమె భరించలేని పరిస్థితి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??...
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారు...

ఆ విషయాన్ని ఒకానొక సందర్బంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తన బాధను వ్యక్తం చేసింది.హాన్లీ సోషల్‌ మీడియా పోస్ట్‌ను చూసిన ట్యాక్సీ డ్రైవర్‌ జూబిన్‌ చలించి పోయాడు.

Advertisement

హాన్లీని ఇంటి నుండి స్కూల్‌కు మరియు స్కూల్‌ నుండి ఇంటికి చేర్చే బాధ్యతను తాను తీసుకున్నాడు.ఆమెకు సాయంగా తాను ఉంటానంటూ హామీ ఇచ్చి మళ్లీ స్కూల్‌లో జాయిన్‌ చేశాడు.ఇంట్లోంచి బయటకు వచ్చే వరకు వెయిట్‌ చేసి, స్కూల్‌ వద్ద దించి వెళ్లకుండా క్లాస్‌ రూం వరకు ఆమెను తీసుకు వెళ్లి అక్కడ వదిలేసి తన పని చూసుకునేవాడు.

స్కూల్‌ వదిలే సమయంకు మళ్లీ అక్కడ ఉండి ఆమెను కారులో ఎక్కించుకుని తిరిగి ఇంటి వద్ద దించేవాడు.ఇంత కష్టపడుతూ చదువుకుంటున్న హాన్లీ మంచి ఉద్యోగం సంపాదించి తాను కూడా నలుగురికి సాయంగా నిలుస్తానంటుంది.

అతడు అందుబాటులో లేని సమయంలో మరెవ్వరైన ఆమెకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో మరో ఏడుగురు ట్యాక్సీ డ్రైవర్లతో కూడా ఈ విషయాన్ని తెలియజేసి వారికి కూడా హాన్లీ కి సాయం చేసేందుకు ఒప్పించడం జరిగింది.అందుకే ఆ ట్యాక్సీ డ్రైవర్ ను రియల్ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు