కేసీఆర్ తో హీరో విజయ్ భేటీ ? 'రాజకీయం ' కోసమైనా ?

కేసీఆర్ తో హీరో విజయ్ భేటీ ? ‘రాజకీయం ‘ కోసమైనా ?

ఎన్నికల సమయం దగ్గర కొచ్చే కొలదీ దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పీడ్ పెంచారు.

 Tamil Hero Vijay Meet On Telangana Cm Kcr , Hero Vijay, Dalapathi Vijay, Tamil H-TeluguStop.com

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఆయన గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే తమిళ హీరో విజయ్ బుధవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.వీరి భేటీ కి సంబంధించి పూర్తి వివరాలు బయటకు తేలినప్పటికీ రాజకీయ అంశాలకు సంబంధించి వీరిద్దరి మధ్య జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.తాను మర్యాదపూర్వకంగానే సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్లు విజయ్ పేర్కొన్నారు.

అయితే వీరి మధ్య అనేక రాజకీయ అంశాల గురించి చర్చ జరిగిందట.
   గత కొంత కాలంగా హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సొంతంగా ఆయన రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు అది కాకుండా ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో 115 స్థానాల్లో విజయ్ అభిమాన సంఘం తరఫున అభ్యర్దులు పోటీకి దిగారు.ఇందులో మొత్తం 45 మంది అభ్యర్థులు గెలుపొందారు.13 చోట్ల ఏకగ్రీవంగా గెలిచారు.దీంతో పార్టీ పెట్టకుండానే ఆయన అభిమాన సంఘం ఎన్నికల్లో విజయం సాధించడం వంటివి ఆయన క్రేజ్ ను తెలియజేస్తున్నాయి.

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోదించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన విజయ్ నిన్న కేసీఆర్ తో భేటీ అయ్యారు.
 

Dalapathi Vijay, Vijay, Tamil, Telangana Cm-Politics

 కాంగ్రెస్ బీజేపీలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయ్ ఆ రెండు పార్టీలను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ తో బేటీ అయ్యారు.తాను రాజకీయ పార్టీ స్థాపిస్తే ఎలా ఉంటుంది అనే అంశం పైన చర్చించినట్లు సమాచారం.ఇప్పటికే విజయ్ పేరుతో ఆయన అభిమానులే విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో రాజకీయ ప్రచారాన్ని మొదలుపెట్టారు.

చాలాకాలం నుంచి రాజకీయ పార్టీ విజయ్  పెడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube