ఈ ఆహారాలను తింటే జుట్టు తొందరగా తెల్లగా మారిపోతుంది .... జాగ్రత్తగా ఉండండి

జుట్టులో ఒక్క తెల్ల వెంట్రుక వచ్చిందంటే మనం చేసే హడావిడి మాములుగా ఉండదు.అప్పుడే నాకు వయస్సు అయ్యిపోతుందా అని తెగ ఆందోళన పడిపోతూ ఉంటారు.

అయితే వయస్సు పెరగటం వలన తెల్ల జుట్టు వస్తే పర్వాలేదు.కానీ కొన్ని ఆహారాల కారణంగా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంది.

ఈ ఆహారాల గురించి తెలుస్కొని దూరంగా ఉంటే తెల్ల జుట్టు సమస్యను కొంత వరకు నివారించవచ్చు.ప్రాసెస్డ్ ఫుడ్స్‌ ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవటం వలన కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్‌ లో మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువగా ఉండుట వలన అది మన మెటబాలిజం ప్రక్రియపై ప్రభావం చూపి జుట్టు తెల్లగా మారటానికి కారణం అవుతుంది.ఉప్పు ఉప్పును మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోవటం వలన శరీరంలో ద్రవాల నియంత్రణ లేక ఆ ప్రభావం జుట్టు మీద పడుతుంది.ఉప్పులో ఉండే సోడియం ఎక్కువగా శరీరంలోకి చేరితే జుట్టు సమస్యలే కాకుండా బిపి పెరిగి కిడ్నీ సమస్యలు వస్తాయి.కూల్ డ్రింక్స్ చాలా మంది ఎక్కువగా కూల్ డ్రింక్స్ త్రాగుతూ ఉంటారు.

Advertisement

జుట్టు తెల్లబడటానికి కూల్ డ్రింక్స్ కూడా ఒక కారణం.ఎందుకంటే కూల్ డ్రింక్స్ లో ఉండే సోడా, చక్కెరలు జుట్టు ఎదుగుదలకు అవసరమైన విటమిన్స్ శరీరం గ్రహించకుండా చేస్తాయి.

దాంతో తెల్ల జుట్టు తొందరగా వచ్చేస్తుంది.పంచదార పంచదార ఎక్కువగా ఉండే ఆహారాలు,స్వీట్స్ ఎక్కువగా తీసుకొనే వారిలో తొందరగా తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంది.

జుట్టు చాలా వేగంగా తెల్లగా మారుతుంది.జుట్టు నల్లగా ఒత్తుగా ఉండటానికి విటమిన్ E చాలా అవసరం.

పంచదారను ఎక్కువగా తీసుకోవటం వలన మన శరీరం విటమిన్ E గ్రహించలేదు.దాంతో తెల్ల జుట్టు తొందరగా వచ్చేస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై...
Advertisement

తాజా వార్తలు