మాధవన్ చూసి ఒక్కసారిగా షాకైన హీరో సూర్య.. ఏం జరిగిందంటే?

మాధవన్ చూసి ఒక్కసారిగా షాకైన హీరో సూర్య.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో, మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినిమాలలో వైవిధ్యమైన పాత్రలో కథలతో అలరిస్తూ ఉంటాడు మాధవన్.

 Suriya Shocked After Seeing R Madhavan Nambi Narayanan Look , Madhavan, R Madhav-TeluguStop.com

ఇకపోతే మాధవన్ తాజాగా నటిస్తున్న బయోపిక్ రాకెట్రి.ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త అయిన నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

ఈ సినిమాలో హీరో మాధవన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.అయితే ఈ పాత్ర కోసం మాధవన్ తనని తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు.

అచ్చం నంబి నారాయణ్ లాగా తెల్ల జుట్టు కళ్ళద్దాలతో కనిపించాడు.

ఇకపోతే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా షూటింగ్ జరుగుతుండగా సూర్య షూటింగ్ చూడటం కోసం అక్కడికి వెళ్తాడు.సూర్య షూటింగ్ సెట్లోకి అడుగు పెట్టగానే నంబి నారాయణ్ గెటప్ వేసుకున్న మాధవన్ ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.

ఒక్క క్షణం ఎవరూ నిజమైన నంబి నారాయణ్‌ అని గుర్తు పట్టలేదనేంతగా ఓ షాకింగ్‌ లుక్‌ ఇచ్చాడు.ఇక సెట్స్‌లోని సూర్య, నారాయణ్‌ రాగానే కూర్చి నుంచి లేచి ఇరువురి స్వాగతం పలికాడు మ్యాడీ.

అనంతరం సూర్యను తన స్నేహితుడు అంటూ నారాయణ్‌కు పరిచయం చేశాడు.ఇక ఆయన సూర్యను పలకరిస్తూ మీ సినిమాలు చాలా బాగుంటాయని, మీ నటన అద్భుతమని కొనియాడారు.అంతేకాదు మీ నాన్నగారు దర్శకత్వం కూడా తనకు బాగా నచ్చుందని చెప్పడంతో సూర్య ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు.కాగా ఇక నంబి నారాయణ్‌ భార్య పాత్రలో సీనియర్‌ నటి సిమ్రాన్‌ కనిపించనుంది.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube