నారదుని జన్మ రహన్యమేమిటో మీకు తెలుసా..? 

నారదుని జన్మ రహన్యమేమిటో మీకు తెలుసా..? 

నారాయణ.నారాయణ.ఈ నామస్మరణ వినగానే గుర్తొచ్చేది.‘కలహ భోజనుడు’ నారద మహర్షి.వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి మహా పురుషులను, మహా భక్తులుగా మలచినవాడు నారదుడే.అలాంటి  మహానుభావుడి జన్మ రహస్యం మీకు తెలుసా.?

 Story Behind Saint Naratha Maharshi , Devotional , Narada Maharshi , Naradudu ,-TeluguStop.com

నారదుడు పూర్వ జన్మలో దాసీ పుత్రుడు.తల్లి ఐశ్వర్య వంతుడైన బ్రాహ్మణుడి ఇంటిలో ఊడిగం చేసేది.ఆమె వెంటే యజమాని ఇంటికి వెళ్ళేవాడా బాలుడు.ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస్య దీక్ష గడపడానికి ఆ ఇంటికి వచ్చారు.‘వారికి  సేవలు చేస్తూండ మని యజమాని నారదుడికి పురమాయించాడు.సన్యాసులు పిల్లవాడైన నారదుడి సేవలకు ముచ్చట పడ్డారు.

దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదుణ్ని వాత్సల్యంతో పక్కన కూర్చో బెట్టుకుని ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని, ప్రణవాన్ని ఉపదేశించారు. పాముకాటుతో తల్లి చనిపోయాక ‘లోక సంచారం చేస్తూ ఈశ్వరాన్వేషణ చేస్తూ జీవనం గడిపేస్తాను’ అనుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు.

రావిచెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరీ మంత్రాన్ని తదేకంగా జపిస్తున్నాడు.

ఆ సమయంలో ఒక మెరుపులా శ్రీమన్నారాయణుడి అశరీరవాణిలో పలికాడు.‘ నీవు మళ్లీ జన్మలో  బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు.ఆనాడు నీకు ’మహతి’ అనే వీణను బహూకరిస్తాను.

దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావు’’ అని అన్నాడు శ్రీమన్నారాయణుడు. ఆయన చెప్పినట్టుగానే .తరవాత తన కుమారుడిగా నారదుణ్ని సృష్టించాడు బ్రహ్మ.’నారాయణ నామం చెప్పుకొంటూ లోకమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ వైకుంఠం, సత్యలోకం, కైలాసం… ఇలా ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమాన్ని ఆవిష్కరించేవాడు.

దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశాలు చేసేవాడు.అందువల్ల నారదుణ్ని దేవతలు, రాక్షసులు సైతం గౌరవించేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube