ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే పాన్ ఇండియా రేంజ్ సినిమా గురించి.. ఈ విషయాలు తెలుసా?

ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే పాన్ ఇండియా రేంజ్ సినిమా గురించి.. ఈ విషయాలు తెలుసా?

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతో గొప్ప సినిమా అని అనుకుంటూ ఉంటారు.ఇలాంటి సినిమా ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో రాలేదు అని భావిస్తూ ఉంటారు.

 Sr Ntr Pan India Movie Kanchukota Details, Senior Ntr, Nt Ramarao, Ntr Pan India-TeluguStop.com

త్రిబుల్ ఆర్ లాంటి ఒక గొప్ప సినిమాతో దాదాపూ 50ఏళ్ల క్రితమే నందమూరి తారక రామారావు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆ సినిమా పేరు కంచుకోట . ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.ఎన్టీఆర్ బావా వియు విశ్వేశ్వర రావు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.

తన కుమార్తె శాంతి పేర్లు కలిసి వచ్చేలా విశ్వశాంతి అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ఈ సినిమాను నిర్మించారు.బంకించంద్ర చటర్జీ రాసిన నవలలు ప్రేరణ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది నాలుగు పాత్రల మధ్య ప్రేమ సినిమా అని చెప్పాలి సినిమాకు రచయిత త్రిపురనేని మహారతి కథ అందించారు అని చెప్పాలి.

సినిమాకు తాతినేని రామారావు ని దర్శకుడిగా పెట్టాలని అనుకున్నారు ముందు.సి.ఎస్.రావు అయితే ఈ సినిమాకు దర్శకుడిగా సరిగ్గా సరిపోతారని ఆ తర్వాత భావించారు.ఇది విశ్వేశ్వరరావు కు నచ్చక పోయినప్పటికీ ఇక ఒత్తిడి కారణంగా చివరికి అంగీకరించారు.

Cs Rao, Kanchukota, Nt Ramarao, Ntr Kanchukota, Ntr Pan India, Pan India, Senior

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక డైలాగ్ పేపర్ ని దర్శకుడు ఎన్టీఆర్ కు ఇచ్చారట.అయితే ఎన్టీఆర్ డైలాగ్ లు మాత్రమే అందులో ఉన్నాయట.ఏంటి ఇలా ఉంది అని ఎన్టీఆర్ డైరెక్టర్ ని అడగడంతో మహారధి ఏ మూడ్ లో రాశారో అంటు డైరెక్టర్ చెప్పారట పట్టుబట్టి మరీ మహారథిని పిలిపించుకుని ఎన్టీఆర్ అసలు విషయాన్ని తెలుసుకున్నారట.

డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలిపారు.ఇక ఈ సినిమాకు మహదేవన్ అందించిన సంగీతం కూడా ప్రాణం పోసింది అని చెప్పాలి.ఈ సినిమా 30 కేంద్రాల్లో విడుదల అయింది.ఏడు లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూళ్లు చేసింది.

శోభన థియేటర్లో శతదినోత్సవ ఫంక్షన్ కూడా జరుపుకుంది ఈ సినిమా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube