ఎన్టీఆర్ కి ఇష్టమైన థియేటర్లో బూతు సినిమాలు.. అసలేం జరిగిందంటే?

ఎన్టీఆర్ కి ఇష్టమైన థియేటర్లో బూతు సినిమాలు.. అసలేం జరిగిందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇక సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా ఎంతో తెలివిగా వివిధ వ్యాపారాలు పై పెట్టుబడి పెడుతూ వచ్చారు అన్న విషయం తెలిసిందే.అదే సమయంలో ఇక ప్రేక్షకులందరికీ సినిమా ఎంటర్టైన్మెంట్ ను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఎన్టీఆర్ ఎస్టేట్స్ ని స్థాపించారు.

 Sr Ntr Favourite Theater Turns B Grade Theater Sr Ntr,  Favourite Theater , B Gr-TeluguStop.com

ఏకంగా రెండున్నర ఎకరాల స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ తో పాటు రెండు థియేటర్లను నిర్మించారు సీనియర్ ఎన్టీఆర్.ఈ విషయం దాదాపు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పాలి.

అప్పటి వరకు టాలీవుడ్ లో అందుబాటులో లేని 70 ఎంఎం థియేటర్ నిర్మిస్తున్నట్లు చెప్పి ఇక ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిగా పెంచారు.తన అభిరుచికి అనుగుణంగానే కళాత్మక విలువలతో ఎన్టీఆర్ ఎంతో సుందరంగా కనిపించే విధంగా థియేటర్ల నిర్మాణం ప్లాన్ చేశారు.1968 నవంబరు 8వ తేదీన ఈ జంట థియేటర్లు ప్రారంభమయ్యాయి.ఇక అప్పట్నుంచి ఈ జంట థియేటర్లకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది.

ఇక ఈ రెండు థియేటర్లకు కూడా స్వర్గస్తుడైన తన ప్రియమైన కుమారుడైన రామకృష్ణ పేరు పెట్టడం గమనార్హం.

Amita Bachchan, Andra Pradesh, Grade, Sholay, Sr Ntr, Tollywood-Latest News - Te

అయితే ఇక్కడ ఏ తెలుగు సినిమా వచ్చిన విడుదలయ్యేది.ఆ తర్వాత ఇంగ్లీష్ సినిమాలు హిందీ సినిమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ థియేటర్లో విడుదల కాక ముందు నుంచే ఈ థియేటర్లలో విడుదల అవుతూ వచ్చాయి.తర్వాత కాలంలో కానీ ఈ జంట థియేటర్ లో కేవలం ఆంగ్ల సినిమాలు హిందీ సినిమాలు మాత్రమే ప్రదర్శిస్తూ వచ్చారు.

అమితాబచ్చన్ నటించిన షోలే చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ ఒక్క థియేటర్ లోనే విడుదల కావడం గమనార్హం.ఎన్టీఆర్ మరణానంతరం మాత్రం అప్పటివరకు ఎంతో వైభవాన్ని కలిగి ఉన్న జంట థియేటర్లకు ఉనికి కోల్పోవడం మొదలయ్యింది.

ఇక అప్పుడు టిడిపి అధికారంలో ఉండడంతో ఇక ఈ థియేటర్ పై పోలీసుల దాడులు జరగవనే ఉద్దేశంతో థియేటర్లలో కొన్నాళ్ళపాటు బూతు చిత్రాలను కూడా ప్రదర్శించారు.కానీ ఆ తర్వాత కాలంలో ఈ రెండు థియేటర్లు నిర్వహణ చూసుకునేవారు లేక మూతపడగా ఇక ఇప్పుడు ఇంద్ర సినిమాస్ సంస్థ ఈ థియేటర్ల నిర్వహణ చేపట్టిందని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube