ఎట్టకేలకు అల్లు శిరీష్ నిజం తెలుసుకున్నాడంటూ ఫ్యాన్స్ ట్రోల్స్‌

ఎట్టకేలకు అల్లు శిరీష్ నిజం తెలుసుకున్నాడంటూ ఫ్యాన్స్ ట్రోల్స్‌

మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో మెజార్టీ హీరోలు ప్రస్తుతం టాలీవుడ్‌ ను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే.కొందరు ఇప్పుడిప్పుడే సక్సెస్ బాట పడుతున్నారు.

 Social Media Movie Trolls On Mega Hero Allu Shirish ,  Allu Shirish ,  Gouravam-TeluguStop.com

అల్లు శిరీష్ మాత్రం కెరీర్ ఆరంభించి దశాబ్ద కాలం దాటినా కూడా ఇప్పటి వరకు కనీసం ఒక భారీ కమర్షియల్‌ సక్సెస్ అందుకోలేదు.అలాగే ఒక మంచి సినిమా అన్నట్లుగా కూడా పేరు దక్కించుకోలేదు.

దాంతో ఆయన కెరీర్‌ ఇప్పుడు ప్రమాదంలో పడ్డట్లు అయ్యింది.అల్లు శిరీష్ సినిమా లపై ఆసక్తి తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టలేదు.

ఆయన నిర్మాతగా సినిమా లు చేయాలనుకున్నాడు.ఆయన హీరోగా సినిమా లు చేయాలనే ఆసక్తి మొదట లేదు.

కాని మద్యలో ఏదో కారణం వల్ల హఠాత్తుగా గౌరవం సినిమా తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు.ఆ సినిమా నిరాశ పర్చింది.

అయినా కూడా కంటిన్యూ అయ్యాడు.వరుసగా సినిమా లు చేయకుండా చాలా ఆలస్యంగా సినిమా లు చేస్తూ వచ్చాడు.

ఆయన ఇండస్ట్రీ లో హీరోగా సెట్‌ అవ్వడు అంటూ కొందరు మొదటి నుండి కామెంట్స్ చేస్తున్నారు.ఇటీవల శిరీష్ తన సన్నిహితుల వద్ద తాను హీరోగా సెట్‌ అవ్వలేనేమో అంటూ వ్యాఖ్యలు చేశాడట.

అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఇన్నాళ్లకు అయినా అల్లు శిరీష్ ఉన్న విషయం తెలుసుకున్నాడు.

శిరీష్ కు నిర్మాణం పై మంచి పట్టు ఉంటుంది.అందుకే ఆయన నిర్మాతగా మారడం బెటర్.

హీరోగా సెట్ అవ్వను అంటూ ఇన్నాళ్లకు తెలుసుకోవడం అభినందనీయం అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.కాని అల్లు శిరీష్ నటుడిగా కూడా మంచి పాత్రల్లో నటించాడు.

ఆయన మొదటి సినిమా గౌరవం కమర్షియల్‌ హిట్‌ కాకున్నా కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్‌ చిత్రం ఆ సినిమా ను చేసే ఘట్స్ టాలీవుడ్‌ లో ఎవరికి లేదు.కనుక శిరీష్ నుండి అలాంటి మంచి నాన్ కమర్షియల్‌ సినిమా లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube