రెండు పాటలు షూటింగ్ పూర్తి చేసుకుని ఆగిపోయిన ఎన్టీఆర్ మూవీ ఏదో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు రాజమౌళి తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

 Shocking Facts About Young Tiger Ntr Cine Career Details Here , Ntr , Pawans Sridhar , Shocking Facts ,simhadri , Rajamouli , Two Songs Shooting , Young Tiger Ntr-TeluguStop.com

స్టూడెంట్ నంబర్1 సినిమా కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఆడియన్స్ కు కూడా జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఏంటో సులభంగా అర్థమైంది.జూనియర్ ఎన్టీఆర్ ఏ ఎమోషన్ అయినా అద్భుతంగా పలికిస్తాడని కెరీర్ తొలినాళ్లలోనే సినిమాల ద్వారా తారక్ ప్రూవ్ చేసుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఫ్లాప్స్ ఉన్నా నటుడిగా ఎన్టీఆర్ ఫెయిల్ అయిన సందర్భాలు అయితే లేవనే చెప్పాలి.బరువు తగ్గిన తర్వాత తారక్ ను అభిమానించే అభిమానుల సంఖ్య మరింత పెరిగింది.

 రెండు పాటలు షూటింగ్ పూర్తి చేసుకుని ఆగిపోయిన ఎన్టీఆర్ మూవీ ఏదో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో కొంతకాలం షూటింగ్ జరుపుకుని ఆగిపోయిన సినిమా లేదనే చాలామంది ఫ్యాన్స్ భావిస్తారు.వాస్తవానికి సింహాద్రి సినిమాకు ముందు జూనియర్ ఎన్టీఆర్ పవన్స్ శ్రీధర్ అనే వ్యక్తి డైరెక్షన్ లో ఒక సినిమాకు ఓకే చెప్పి షూటింగ్ లో పాల్గొన్నారు.

దొరస్వామిరాజు నిర్మాత కాగా రెండు పాటలు షూటింగ్ జరిగిన తర్వాత సినిమా ఔట్ పుట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు అనుమానాలు మొదలయ్యాయి.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నిర్మాత దొరస్వామిరాజుతో మాట్లాడి ఈ సినిమాతో హిట్టిస్తామా ఇవ్వమా అనే అనుమానం తనకు ఉందని వెల్లడించారు.

ఆ తర్వాత రాజమౌళి ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కావడంతో పాటు కథ మార్చి సింహాద్రి సినిమాను తెరకెక్కించారు.

అప్పటివరకు పవన్స్ శ్రీధర్ డైరెక్ట్ చేసిన సన్నివేశాలను పూర్తిగా పక్కన పెట్టి మళ్లీ కొత్తగా ఈ సినిమాను తెరకెక్కించారు.సింహాద్రి సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో అప్పటి స్టార్ హీరోలు సైతం జూనియర్ ఎన్టీఆర్ నుంచి తమకు గట్టి పోటీ ఉంటుందని భావించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube