మహేష్ బాబు మరదలిగా ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ.. ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే వేసవి సెలవులకు విడుదల కావాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

 Samyuktha Menan As Maheshs Sister In Law In Trivikram Directorial Movie, Samyuktha Menon, Mahesh Sister, Tollywood, Trivikram-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో పాల్గొంటారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

మహేష్ బాబు సర్కారు వారి పాట పూర్తి చేయగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించి సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 మహేష్ బాబు మరదలిగా ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించడం కోసం బుట్టబొమ్మ పూజాహెగ్డేను ఇప్పటికే ఫైనల్ చేశారు.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మరదలి పాత్రలో నటించడం కోసం మరొక హీరోయిన్ కావాలని ఇన్ని రోజులు ఆ హీరోయిన్ కోసం దర్శకుడు వేట మొదలు పెట్టారు.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబు మరదలుగా నటించే అవకాశాన్ని మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

నటి సంయుక్త మీనన్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రానా హీరోలుగా తెరకెక్కుతున్న  ‘భీమ్లా నాయక్’చిత్రంలో రానా భార్య పాత్రలో నటిస్తున్నారు.ఇక పోతే ఈ చిత్రానికి దర్శక పర్యవేక్షకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ మరదలు పాత్రలో నటించడానికి నటి సంయుక్త మీనన్ ను సంప్రదించడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.

Samyuktha Menan As Maheshs Sister In Law In Trivikram Directorial Movie, Samyuktha Menon, Mahesh Sister, Tollywood, Trivikram - Telugu Mahesh Sister, Samyuktha Menon, Tollywood, Trivikram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube