ఏపీ సీఎం జగన్ పై సెటైర్లు వేసిన ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ అడ్మిన్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించిన విషయం కూడా తెలిసిందే.

 Rrr Twitter Admin Satires On Ap Cm Jagan Do You Know What Happened , Rrr Movie, Twitter, Cm Jagan, Tollywood, Telugu Film Industry-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అయితే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి ముఖ్య కారణం సినిమా ప్రమోషన్స్ అని చెప్పవచ్చు.

ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత నుంచి ఈ సినిమాను ఏదో ఒక విధంగా ప్రమోట్ చేస్తూనే వచ్చారు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.ఆర్ఆర్ఆర్ అన్న టైటిల్ చేసిన తర్వాత ఆర్ఆర్ఆర్ పేరు మీద ఒక ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఆ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 ఏపీ సీఎం జగన్ పై సెటైర్లు వేసిన ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ అడ్మిన్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే నెటిజన్స్, అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సందేహాలను తీరుస్తూ వచ్చారు ఆర్ఆర్ఆర్ మిత్ర బృందం.ఈ క్రమంలోనే తాజాగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆర్ఆర్ఆర్ ఖాతా ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.

అయితే ఆ సమాధానం లో ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేయడంతో వివాదానికి దారితీసే విధంగా ఉంది.ప్రొఫెసర్ అనే ట్విట్టర్ ఖాతాదారుడు ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ ఖాతాను ఉద్దేశిస్తూ అకౌంట్ ని అమ్ముతావా మావా అని అడగగా.ఆ ప్రశ్నకు ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ ఖాతా సమాధానమిస్తూ నీ డీపీలో ఉన్న అతని అడుగు కొట్టేయడానికి ఏదైనా ప్లాన్ వేస్తాడేమో అంటూ కాస్త ఫన్నీగా సమాధానం ఇచ్చారు.అయితే సదరు ఖాతాదారులు డిపి లో ఏపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉండటం గమనార్హం.

ఈ ట్వీట్ చేసిన తరువాత ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube