అక్కడ ఆర్ఆర్ఆర్‌ కంటే రాధేశ్యామ్‌ పై హైప్ ఎక్కువ ఉందట

అక్కడ ఆర్ఆర్ఆర్‌ కంటే రాధేశ్యామ్‌ పై హైప్ ఎక్కువ ఉందట

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.వారం గ్యాప్ లోనే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్‌ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Rrr Movie Vs Prabhas Radheshyam Movie In Bollywood , Rrr  , Prabhas, Radhehsyam,-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమా లు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి.ఈ రెండు సినిమా ల వల్ల బాలీవుడ్‌ లో జనవరి లో సినిమా లు విడుదల చేయడానికే ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్ వెనుకాడుతున్నారు.

అంతగా ఈ సినిమా లు రెండు భారీ బజ్ ను క్రియేట్‌ చేశాయి.ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా బాహుబలి కారణంగా హైప్ విపరీతంగా ఉంది.

ఇక రాధే శ్యామ్‌ కు సాహో మరియు బాహుబలి సినిమాల కారణంగా విపరీతమైన హైప్ ఉంది.ఈ రెండు సినిమాల్లో సౌత్‌ లో ఖచ్చితంగా ఆర్ .ఆర్ .ఆర్‌ కు బజ్‌ ఎక్కువగా ఉంది.కాని ఉత్తరాదిలో మాత్రం ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ఉండటం వల్ల రాధే శ్యామ్‌ కు బజ్‌ ఎక్కువ గా ఉందంటూ సోషల్‌ మీడియాలో ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది.

రాధే శ్యామ్‌ సినిమా ను హిందీలో ప్రత్యేకంగా పాటలతో ప్రమోట్‌ చేయడంతో పాటు పలువురు స్టార్స్ ను కూడా హిందీ లో నటింపజేయడం తో పాటు ప్రభాస్ కు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉండటం వల్ల అక్కడ భారీ ఆధరణ రాధే శ్యామ్‌ కు ఉందని అంటున్నారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ కు తక్కువ ఏమీ లేదు.అయితే ఈ రెండు సినిమా లు ఓపెనింగ్‌ విషయంలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడబోతున్నాయి.రాజమౌళి సినిమా యావరేజ్ గా ఉన్నా భారీ వసూళ్లు నమోదు అవుతాయి.రాధే శ్యామ్‌ మాత్రం లాంగ్‌ రన్‌ వసూళ్ల కోసం కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

మొత్తానికి ఆర్ ఆర్‌ ఆర్‌ తో జక్కన్న రాజమౌళి మరియు రాధే శ్యామ్‌ తో ప్రభాస్ లు బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద కాస్త ఠఫ్‌ గానే ఫైట్‌ చేయబోతున్నారు.వీరిద్దరు కలిసి చేయబోతున్న పోరాటం లో ఎవరు గెలిచినా తెలుగు సినిమా స్థాయి పెరిగినట్లే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube