మద్రాస్ లో ఎన్టీఆర్ ఇంటికి, బెజవాడలో బాబాయ్ హోటల్..రెండిటికి ఏంటి లింక్ ?

మద్రాస్ లో ఎన్టీఆర్ ఇంటికి, బెజవాడలో బాబాయ్ హోటల్..రెండిటికి ఏంటి లింక్ ?

ఎన్టీఆర్. ఈ పేరు చెప్తే మన తెలుగువాడు ఎవరైనా సరే తన గుండె ఉప్పంగి పోవాల్సిందే.

 Relation Between Babai Hotel And Madras Ntr House Details, Nandamuri Taraka Rama-TeluguStop.com

తెలుగుజాతి మొత్తం సగర్వంగా తలెత్తే విధంగా చేశాడు మన నందమూరి తారక రామారావు.వాస్తవానికి ఎక్కడి వారి కైనా వారి వారి బంధుత్వాల్లో లేదంటే, వారి ఊర్లలో ఆత్మీయులు ఉంటారు.

ఏ రంగంలో వారికి ఆ రంగంలో వారే దగ్గర వారై ఉంటారు.కానీ మన నందమూరి నటసింహం ఎన్టీఆర్ కు మాత్రం అలా కాదు ఆయన పేరు చెప్తేనే అదొక ఎమోషన్ అందుకే అందరూ కూడా ఎన్టీఆర్ కి ఆత్మీయులు.

అన్న గారి విషయంలో సినిమా వాళ్ళు మాత్రమే కాదు తను పుట్టిన ఊరు, పెరిగిన చోటు, చదువుకున్న చోటు, అలాగే తను పనిచేసిన చోటు సినిమా ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉన్న ప్రదేశాలే కావడం విశేషం.

అలా సినిమా ఇండస్ట్రీకి నందమూరి తారక రామారావు రాకముందు బాబాయ్ హోటల్ అనే ఒక హోటల్ కి ప్రతిరోజు పాలు పోసేవారట ఈ హోటల్ కి అన్నగారికి ఒక ప్రత్యేకమైన బంధం ఉంది అదేంటో ఈ ఇప్పుడు చూద్దాం.

వాస్తవానికి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయం లేక ముందు ఆయన పాలు, పెరుగు అమ్ముతూ జీవించేవారు అలా రెగ్యులర్ గా బాబాయ్ హోటల్ కి ఎన్టీఆర్ పాలు పోసేవారు.దాంతో ఎన్టీఆర్ కి బాబాయ్ హోటల్ కి మంచి సంబంధం బాంధవ్యాలు ఉన్నాయి.

ఆ తర్వాత ఆయన సినిమాలు మానేసినా కూడా ఆ హోటల్ తో అనుబంధం కంటిన్యూ చేయడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే.

Babai Hotel, Gandhi Nagar, Nandamuritaraka, Ntr Babai Hotel, Ntr Madras, Senior

నిజానికి అన్న గారు పుట్టి, పెరిగింది అంతా కూడా నిమ్మకూరులోనే.సినిమా ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత మద్రాస్ కు మతం మార్చేశాక, ప్రతి ఏటా అన్నగారిని చూడడానికి గాంధీ నగర్ లో ఉన్న బాబాయ్ హోటల్ నుంచి ఒక బృందం వెళ్లి వచ్చేది.వారంతా కూడా అన్నగారిని కలవడానికి ముందే అక్కడికి సమాచారం పంపించేవారు.

దాంతో ఎన్ని షూటింగ్స్ ఉన్నా కూడా గాంధీనగర్ నుంచి వస్తున్న బృందాన్ని కలవడానికి ఎన్టీఆర్ తన సమయాన్ని వెచ్చించేవారు.అంతేకాదు వారికి మద్రాస్ లో ఉన్న అన్ని రకాల రుచులు చూపించి అలాగే వారు ఉండడానికి హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసి వారితో టైం స్పెండ్ చేసి వారిని పంపించే వారట.

Babai Hotel, Gandhi Nagar, Nandamuritaraka, Ntr Babai Hotel, Ntr Madras, Senior

అలా అన్నగారంటే వారందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం ప్రతి ఏటా ఒకరోజు టైం పెట్టుకొని అన్నగారిని కలవాలనుకున్న వారందరూ కూడా బాబాయి హోటల్ కి అడ్డాగా పెట్టుకొని అక్కడ కలుసుకొని అక్కడ నుంచి దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ కి చేరుకొని అక్కడి నుంచి మద్రాస్ కు చేరుకొని అన్నగారింటికి వెళ్లేవారట ఈ బృందమంతా కూడా.వీరంతా కూడా అన్నగారికి మంచి అభిమానులను చెప్పాలి అలా బాబాయ్ హోటల్ తో ఎన్టీఆర్ ఇంటికి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube