ఆ పాత్రలో నటిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా.. రెజీనా కసాండ్రా!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో వివిధ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రెజీనా కసాండ్రా ఒకరు.ఎన్నో అద్భుతమైన చిత్రాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా నెగిటివ్ పాత్రల ద్వారా కూడా అందరినీ మెప్పించి తాజాగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమాలో కూడా ప్రత్యేక పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.

 Regina As Mrinalini Sarabhai In Rocket Boys Movie Details, Regina, Mrinalini Sarabhai, Tollywood, Koratala Siva, Rocket Boys Movie, Mrinalini Sara Bhai, Sony Liv Streaming, Web Series,regina Cassandra-TeluguStop.com

ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో లెస్బియన్‌గా నటించడమే కాకుండా ‘రాకెట్ బాయ్స్’ అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 ఆ పాత్రలో నటిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా.. రెజీనా కసాండ్రా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విక్రమ్ సారాభాయ్ హోమీ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4వ తేదీన సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.ఇక ఈ వెబ్ సిరీస్ లో రెజీనా విక్రమ్ సారాభాయ్ భార్య మృణాళిని సారాభాయ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అభయ్ పన్ను దర్శకత్వంలో మోనీషా అద్వానీ, మధు భోజ్వానీసంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మృణాళినీ సారభాయ్ పాత్రలో నటించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.మృణాళిని విక్రమ్ సారాభాయ్ భార్యగా మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా తనకున్న కలలతో ఎంతో అద్భుతంగా జీవించింది.అలాంటి గొప్ప వ్యక్తి పాత్రలో నటించడం తన అదృష్టం అని వెబ్ సిరీస్ లో తన పాత్ర చాలా తక్కువగా ఉన్నా.అంత గొప్ప వ్యక్తి పాత్రలో నటించడం నిజంగా తన అదృష్టమని రెజీనా తెలిపారు.

Regina As Mrinalini Sarabhai In Rocket Boys Movie Details, Regina, Mrinalini Sarabhai, Tollywood, Koratala Siva, Rocket Boys Movie, Mrinalini Sara Bhai, Sony Liv Streaming, Web Series,regina Cassandra - Telugu Koratala Siva, Mrinalinisara, Regina, Rocket, Sony Liv, Tollywood, Web

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube